Wednesday, 15 November 2017

283. O Sanghama Sarvangama Paraloka Rajyapu

ఓ సంఘమా సర్వాంగమా – పరలోక రాజ్యపు ప్రతిబింబమా
యేసయ్యను ఎదుర్కొనగ – నీతి నలంకరించి సిద్ధపడుమా
ఓ సంఘమా వినుమా

రాణి ఓఫిరు అపరంజితో – స్వర్ణ వివర్ణ వస్త్ర ధారణతో
వీణ వాయిద్య తరంగాలతో – ప్రాణేశ్వరుని ప్రసన్నతతో
ఆనంద తైల సుగంధాభిషేకము (2)
పొందితివా యేసునందు (2)       ||ఓ సంఘమా||

క్రీస్తే నిన్ను ప్రేమించెనని – తన ప్రాణాలర్పించెనని
స్వస్థపరచె నిర్దోషముగా – ముడత కళంకము లేనిదిగ
మహిమా యుక్తంబుగా నిలువ గోరె యేసుడు (2)
సహియింతువా తీర్పునాడు (2)       ||ఓ సంఘమా||

చీకటిలో నుండి వెలుగునకు – లోకములో నుండి వెలుపలకు
శ్రీకర్త గుణాతిశయములను – ప్రకటించుటకే పిలిచెనని
గుర్తించుచుంటివా క్రియలను గంటివా (2)
సజీవముగా నున్నావా (2)       ||ఓ సంఘమా||

చల్లగనైన వెచ్చగను – ఉండిన నీకది మేలగును
నులివెచ్చని స్థితి నీకుంటే – బయటకు ఉమ్మబడెదవేమో
నీ మనసు మార్చుకో తొలిప్రేమ కూర్చుకో (2)
ఆసక్తితోడ రక్షణ నొందుమా (2)       ||ఓ సంఘమా||

282. Alayamlo Pravesinchandi Andaru

ఆలయంలో ప్రవేశించండి అందరు
స్వాగతం సుస్వాగతం యేసు నామంలో
మీ బ్రతుకులో పాపమా కలతలా
మీ హృదయంలో బాధలా కన్నీరా
మీ కన్నీరంతా తుడిచి వేయు రాజు యేసు కోసం 

దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై
వెదికే వారికంతా కనబడు దీపము
యేసు రాజు మాటలే వినుట ధన్యము
వినుట వలన విశ్వాసం అధికమధికమై
ఆత్మలో దాహము తీరెను రారండి
ఆనందమానందం హల్లెలూయా 

ప్రభు యేసు మాటలే పెదవిలో మాటలై
జీవ వృక్షంబుగా ఫలియించాలని
పెదవితో పలికెదం మంచి మాటలే
హృదయమంతా యేసు ప్రభుని ప్రేమ మాటలై
నింపెదం నిండెదం కోరెదం పొందెదం
ఆనందమానందం హల్లెలూయా 

281. Sakthi Chetha kadanenu Balamuthonidi Kadanenu

శక్తిచేత కాదనెను - బలముతోనిది కాదనెను     ||2||
నా ఆత్మద్వారా దీనిచేతునని యెహోవా సెలవిచ్చెను       ||2||

 1.           గొప్ప పర్వతమా - జెరుబ్బాబెలు నడ్డగింపను
               ఎంతమాత్రపు దానవు నీవనెను - చదును భూమిగ మారెదవు

 2.           ఇశ్రాయేలు విను - నీ భాగ్యమెంత గొప్పది
               యెహోవా రక్షించిన నిన్ను - బోలిన వారెవరు

280. Yesayya Na Hrudayabhilasha Nivenayya

యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా
మెస్సయ్యా నా తియ్యని తలంపులు నీవేనయ్యా

పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై
నా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు
పూజనీయుడా నీతి సూర్యుడా
నిత్యము నా కనుల మెదలుచున్నవాడా   ||యేసయ్యా||

ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో
మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన షాలేము రాజా
విజయశీలుడా పరిశుద్ధాత్ముడా
నిత్యము నాలోనే నిలచియున్నవాడా      ||యేసయ్యా||

279. Pavurama Sanghamupai Vralumide

పావురమా సంఘముపై వ్రాలుమిదే జ్వాలలుగా (2)
హల్లెలూయా – హల్లేలూయా (2)

తొలకరి వానలు కురిసే ఫలభరితంబై వెలిసే (2)
కడవరి చినుకులు పడగా పొలములో (2)
ఫలియించెను దీవెనలే                             ||పావురమా||

అభిషేకాలంకృతమై అపవాదిని కూల్చెనులే (2)
సభకే జయమౌ ఉబికే జీవం (2)
ప్రబలెను ప్రభు హృదయములో             ||పావురమా||

కనుతెరచే నీ కనులే - వినజేసే నీ చెవులే (2)
నను
 తాకెను నా తనువే  (2)
వశమై నిను చూపును లోకములో        ||పావురమా||

బలహీనతలో బలమా బహుమానములో మహిమా (2)
వెలిగే వరమా ఓ పావురమా (2)
దిగిరా దిగిరా త్వరగా                             ||పావురమా||

278. Parisudhathma Ra Nanu Nadipinchu

పరిశుద్ధాత్మ రా (2) నను నడిపించు
ప్రభు పాద సన్నిధికి పరిశుద్ధాత్మ రా
ప్రభు నీ కొరకే యేసు నీ కొరకే
నే చేతులెత్తెదా పరిశుద్ధాత్మ రా

మోకాళ్ళూని శిరస్సు వంచి చేతులెత్తి
నిన్ను ప్రార్ధించెద ప్రభు నీ కొరకే...

యేసే మార్గము - యేసే సత్యము
యేసే నా జీవము - యేసే నా ప్రభు ప్రభు నీ కొరకే

Tuesday, 20 June 2017

277. Panduga Penthekostu Panduga Viswasulara

పండుగ పెంతెకోస్తు పండుగ - విశ్వాసులారా - పండుగ ఈ వేళ గొప్ప పండుగ = పండుగ పరిశుద్ధాత్మ భక్త జనముల హృదయములలో - నిండుగానే కుమ్మరింపై - నిలిచి వాసము చేసినట్టి

నూట యిరువది మంది యొక్క - చోట నొక్కరై యుండి కూటమున ప్రార్ధించు చుండ - కుమ్మరింపు గలిగినట్టి

నేడు నందరు నేకముగనే - కూడుకొని యది తలంచుకొని వేడుకొన్న యెడల ఆత్మ - విరివిగానే వచ్చునట్టి

ఆపదలపై ఆపదలు ని - న్నావరించుకొనును గాని ఆప శక్యము గాని యుత్సా - హంబు మది వ్యాపించునట్టి

ఆత్మ కుమ్మరింపె పరిశు - ద్ధాత్మ బాప్తిస్మంబు పరిశు - ద్ధాత్మాభిషేకంబు ఆత్మ నొందుట ఆత్మ పూర్ణత

జీవ బోధలు చేయ గొప్ప - జివ గలుంగును వాక్య మందలి భావములు ఒక ప్రక్క నుండి - ప్రజల కర్ధమగుచు నుండు

కుమ్మరింపు కలుగగానే - కుమ్మరములు - కూలిపోవును ముమ్మరము గా చిక్కులెన్నో - ముంచుకొని పైబడెడు గొప్ప

జనములన్నియు ఆత్మ స్నానము - దినక్రమమున నొందుగాక జనక కుమారాత్మలకును - ఘనత మహిమ మహిమ మహిమ మహిమ

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...