బహుగా ప్రార్ధన చేయుడి
ఇకమీదట బహుగా ప్రార్ధన చేయుడి
బహుగా ప్రార్ధన చేసి - బలమున్ సంపాదించి
మహిలో కీడును గెల్వుడి
దేవుని కెపుడు మహిమ కలుగనీయుడి
చెడుగెక్కువగుచున్నది
భూలోకమున చెడుగెక్కువగుచున్నది
చెడుగుపై - మంచిపై చేయగలదౌనట్లు
విడువక ప్రార్ధించుడి
మీ ప్రార్ధన కడవరకు బోనీయుడి
వాగ్ధానములు చూడుడి
దేవుని గ్రంధ వాగ్ధానములు చూడుడి
వాగ్ధానములె జరుగవలసిన కార్యంబుల్
వాగ్ధానములు నమ్ముడి
ఈరీతిగా ప్రభవును సన్మానించుడి
విందునన్న దేవుని వాగ్ధానము
విందుగా ధ్యానించుడి
విందులో నుండగా వింతగా నెరవేర్పు
బొంది యానందింతురు
ఇది రెండవ విందంచు గ్రహియింతురు
విసుగుదల జెందరాదు
ప్రార్ధన నెరవేర్పు తక్షణమే రాదు
విసుగున్నచో సిద్ధి వెనుకకే పోవును
వసియించుడి దేవుని
వాగ్ధానమున భటులవలె నిల్వుడి
సంశయము పనికిరాదు
లేశంబైన సంశయము పనికిరాదు
సంశయింపక దైవసన్నిధియందు మీ
యంశము విడజెప్పుడి
దానికి గొప్ప యంశ బట్టనీయుడి
సిద్ధికనుపింపకున్న
వాగ్ధానములో - సిద్ధియున్నది చూడుడి
సిద్ధి యప్పుడు మీకై - సిద్ధమై వెడలి
ప్రసిద్ధి లోనికి వచ్చును
మీ నమ్మిక వృద్ధి గాంచి నిల్చును
సంతోషమొందరారె
మనదేవుని సంస్తుతి చేయరారె
సంతోష బలముచే - సర్వ కష్టములను
అంతరింపజేతుము
మనదేవుని సంతోషపరచెదము
అంతయు మనదేగదా
యేసునికున్న - దంతయు మనదేగదా
అంతయు మన ప్రభువు-ఆర్జించి యున్నాడు
స్వంతమని అందుకొనుడి
మీ ఆత్మకు శాంతి జెందనీయుడి
విజయ జీవనము మనదే
క్రీస్తిచ్చిన - విజయ జీవనము మనదే
విజయ జీవనము మనదే - విశ్వమంతయు మనదె
భజన సంఘంబు మనదే
దేవుండున్న పరలోకమెల్ల మనదే