Thursday, 2 January 2020

533. Nuthana Parachumu Ee Nuthana Samvathsaram (New Year Song)

నూతన పరచుము ఈ నూతన సంవత్సరం 
నూతన పరచుము యేసయ్యా నూతన సంవత్సరం
నూతన మనసుతో నూతన ప్రేమతో 
నూతన కృపలతో నూతన దర్శనముతో 
నను నింపుము నడిపించుము 
ఈ సంవత్సరం నూతన సంవత్సరం
నను నింపుము నడిపించుము 
ఈ సంవత్సరం క్రొత్త సంవత్సరం
పాతవి మరచి సమస్తం నూతనపరచి
గత చేదును మరచి మధురంగా నన్ను మార్చి
నూతనమైన జ్ఞానముతో నూతనమైన ఫలములతో
నూతనమైన దీవెనలతో నూతనమైన మేలులతో // నను నింపుము//
లోకమును మరచి నిత్యజీవంలో నడిపి 
నీ ఆత్మతో నింపి నీ రూపులో నను మలచి
నూతనమైన శక్తితో నూతనమైన బలముతో
నూతనమైన వరములతో నూతనమైన ఉజ్జీవంతో // నను నింపుము//

Wednesday, 13 November 2019

532. Santhiki Duthaga Premaku Murthiga



శాంతికి దూతగా – ప్రేమకు మూర్తిగా 
ఆశల జ్యోతిగా – మరియకు సుతునిగా /2/
యేసు జనియించె – ప్రభు యేసు జనియించె /2/
Happy Christmas – Merry Christmas /4/శాంతికి /
కలుషితాలే తెలియనోడు – కన్యకే జనియించే .. 
పసిడి మనసే కలిగినోడు – పేదగా జనియించె 
భువనాలనేలువాడు – భవనాలలోన కాదు 
పశుశాలలోన నేలపై జనియించె –
మన ప్రభువే జనియించె /శాంతికి/

శుభము కూర్చే – శిశువు తానై
దిశను మార్చే – సూచనై 
పాపమంటి కారుచీకటిలో – ఒక పుణ్యకాంతియై ప్రసరించే.. 
– ప్రభు తానై – ప్రభవించే నిల! /శాంతికి/

నింగిలోని దివ్యవాణి నేలపై ధ్వనియించె
దైవమంటి మమత తానై మనిషిగా ఉదయించే 
మనలోని బాధ తీర్చే – జనజీవితాలు మలచే –
ఎనలేనిజాలై లాలిగుణమై నిలిచె  –
ప్రభుకిరణం – తొలికిరణం  /శాంతికి/

Tuesday, 29 October 2019

531. Idi Subhodayam Kristhu Janmadinam


ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం
ఇది లోక కల్యాణం – మేరి పుణ్య దినం… క్రీస్తు జన్మదినం
రాజులనేలే రారాజు – వెలసెను పశువుల పాకలో
పాపుల పాలిట రక్షకుడు – నవ్వెను తల్లి కౌగిలిలో
భయములేదు మనకిలలో – జయము జయము జయమహో /2/
గొల్లలు జ్ఞానులు ఆనాడు – ప్రణమిల్లిరి భయభక్తితో
పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ దీప్తితో
జయ నినాదమే భువిలో – ప్రతిద్వ్హనించెను ఆ దివిలో /2/



530. Andaru Mechina Andala Tara (Christmas Song)

అందరు మెచ్చిన అందాల తార 
అవనికి తెచ్చెను వెలుగుల మేడ /2/
క్రిస్మస్  హ్యాపీ  క్రిస్మస్
హ్యాపీ  హ్యాపీ  క్రిస్మస్
క్రిస్మస్  మెర్రి  క్రిస్మస్
మెర్రి  మెర్రి  క్రిస్మస్
సృష్టి కర్తయే మరియ తనయుడై 
పశుల పాకలో పరుండినాడు /2/
నీతి జీవితం నీవు కోరగా –
నీకై రక్షణ తెచ్చినాడు /2/
నీకై రక్షణ తెచ్చినాడు.. 
ఇంటిని విడిచి తిరిగిన నాకై 
ఎదురు చూపులే చూచినాడు /2/
తప్పును తెలిసి తిరిగి రాగా 
క్షమియించి కృప చూపినాడు /2/
ఎన్నో వరములు ఇచ్చినాడు ..
పాత దినములు క్రొత్తవి చేసి 
నీలో జీవము నింపుతాడు /2/
కటిక చీకటి వేకువ కాగా 
అంబరమందు సంబరమాయె /2/
హృదయమునందు హాయి నేడు..

Wednesday, 23 October 2019

529. Thurpu Dikku Chukka Butte Meramma O Mariyamma (Christmas Song)

తూర్పు దిక్కు చుక్క బుట్టె
మేరమ్మా – ఓ మరియమ్మా (2)
చుక్కను జూచి మేము వచ్చినాము
మొక్కి పోవుటకు (2)             ||తూర్పు దిక్కు||
బెత్లెహేము పురము లోని బాలుడమ్మా
గొప్ప బాలుడమ్మా (2)
మన పాపముల బాప పుట్టెనమ్మా
మహిమవంతుడమ్మా (2)        ||తూర్పు దిక్కు||
పశువుల పాకలోని బాలుడమ్మా
పాపరహితుడమ్మా (2)
పాపంబు బాపను పుట్టెనమ్మా
సత్యవంతుడమ్మా (2)             ||తూర్పు దిక్కు||
బంగారం సాంబ్రాణి బోళం తెచ్చినాము
బాల యేసు నొద్దకు (2)
బంగారు పాదముల మ్రొక్కెదము
బహుగ పాడెదము (2)            ||తూర్పు దిక్కు||

528. Divya Thara Divya Thara

వి విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్
అండ్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ (2)
దివ్య తార దివ్య తార
దివి నుండి దిగి వఛ్చిన తార (2)
వెలుగైన యేసయ్యను వేనోళ్ళ చాటినది (2)
పశుల పాక చేరినది క్రిస్మస్ తార (2)        ||దివ్య||
జన్మించె యేసు రాజు – పరవశించె పరలోకం (2)
మధురమైన పాటలతో మారుమ్రోగెను
క్రీస్తు జన్మమే పరమ మర్మమే
కారు చీకట్లో అరుణోదయమే (2)
తార తార క్రిస్మస్ తార
తార తార దివ్య తార (2)        ||దివ్య||
ప్రభు యేసు నామం – ప్రజా సంఖ్యలోనున్నది (2)
అవనిలో క్రీస్తు శకము అవతరించినది
క్రీస్తు జన్మమే మధురమాయెనే
శాంతి లేని జీవితాన కాంతి పుంజమే (2)
తార తార క్రిస్మస్ తార
తార తార దివ్య తార (2)        ||దివ్య||
పాపలోక జీవితం – పటాపంచలైనది (2)
నీతియై లోకంలో వికసించినది
క్రీస్తు జన్మమే ప్రేమామయమే
చీకటి హృదయాలలో వెలుగు తేజమే (2)
తార తార క్రిస్మస్ తార
తార తార దివ్య తార (2)        ||దివ్య||

527. Thurpu Dikkuna Chukka Butte Duthalu Patalu Pada Vache (Christmas Song)

తూరుపు దిక్కున చుక్క బుట్టె
దూతలు పాటలు పాడ వచ్చె (2)
చలి మంట లేకుండా ఎలుగే పుట్టె (2)
చల్లని రాతిరి కబురే తెచ్చె (2)
పుట్టినాడంట యేసునాథుడు
పాపములు తీసే పరమాత్ముడు (2)        ||తూరుపు||
గొల్లలు జ్ఞానులు వేగిర వచ్చి
కొలిచినారు తనకు కానుకలిచ్చి
పశుల పాక మనము చేరుదాము
కాపరిని కలిసి వేడుదాము (2)                   ||పుట్టినా||
చిన్నా పెద్దా తనకు తేడా లేదు
పేదా ధనికా ఎప్పుడూ చూడబోడు
తానొక్కడే అందరికీ రక్షకుడు
మొదలు నుండి ఎప్పుడూ ఉన్నవాడు (2) ||పుట్టినా||
మంచి చెడ్డా ఎన్నడు ఎంచబోడు
చెడ్డ వాళ్లకు కూడా బహు మంచోడు
నమ్మి నీవు యేసును అడిగి చూడు
తన ప్రేమను నీకు అందిస్తాడు (2)        ||పుట్టినా||

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...