నా హృదయమంతా నీవే
నా జీవితమంతా నీవే
నా రూపమంతా నీవే యేసు
నా ధ్యాన మంత నీవే క్రీస్తు
నా మార్గమును సరాళము - చేసే వాడవు నీవే
నా దు:ఖమును తుడిచేటి - స్నేహితుడవు నీవే
ఈ శూన్యమును వెలుగుగా - మార్చిన వాడవు నీవే
నా ప్రాణమును రక్షించే - నజరేయుడవు నీవే
నా యుద్దములొ ఖడ్గముగా - ఉండే వాడవు నీవే
నిరంతరం తోడుగా - మాకు ఉండే వాడవు నీవే
ఈ ఆత్మను శుద్దిగా - చేసినవాడవు నీవే
నీ ప్రేమతో నన్ను పిలిచిన - ప్రాణ ప్రియుడవు నీవే