Index-Telugu

Wednesday, 10 August 2016

181. Marapurani Ni Premanu Ne

మరపురాని నీ ప్రేమను నే స్మరింతునులే నా దేవుండా
కరుణచూపి వధువు కొరకే తనువు దానంబు చేసితివి

ఈ జగతిని నీవె సృష్ఠించి ఈ జగతిని నీవె పోషించి
కరుణ జూపి కాపాడితిడితివి ||2||
సర్వము నెత్తి స్తుతించెదను

అశాశ్వతమైన బ్రతుకునకు నీ శాశ్వత జీవమిచ్చితివి
మృత్యుంజయుడా విమోచకుడా ||2||
మోక్షరాజ్యాధి పాలకుడా

శ్రమలెన్నో నను చ్టుి క్రమము తప్పించి బాధింపన్
శ్రమలు నాలో భరించుచునే ||2||
శాంతి సౌఖ్యాలు కలిగెనులే

నా ఎముకలలోని ఒక ఎముక నా మాంసములోని మాంసమును
నరుని నుండి తీయబడిన ||2||
నారీమణులే నా మకుటములే

మహోన్నతమైన దేవుండా మహోన్నత రాజ్యపాలకుడా
మహా ఘనతా ప్రభావములు ||2||
నీకే కలుగున్ హల్లేలూయా

ఒకే దేహంబుగా నుండెన్ ఒకే భావంబుగా నుండెన్
ఒకే నీతిన్ ఒకే ఖ్యాతిన్ ||2||
ఈ ధాత్రిన్ జ్యోతి వెలుగింపన్

2 comments:

  1. Praise the Lord.. For the song lyrics...

    My mom rememberd my grand mother.. And we praised God by this song

    ReplyDelete
  2. Old songs are so melodious... I remember my grandmother singing and still my mom sings such old songs now.. Precious ones... I still don't get lyrics od some old songs. Tjank you so much

    ReplyDelete