Index-Telugu

Wednesday, 10 August 2016

182. Maruvalenu Maruvalenu Maruvalenayya

మరువలేను - మరువలేను - మరువలేనయ్యా
నీ ప్రేమ చరితం ఆ ఘోర మరణం
యేసయ్యా - యేసయ్యా - యేసయ్యా
దయామయా ఓ.. ఓ.. ఓ..

బలిపశువుగా నా పాపము కొరకై - బలియై పోతివయ్యా
నోరు తెరువక భారపు సిలువను - భరియించి ఓర్చితివా
నాకై భారము మోసితివా

పంచగాయములలో - కారుచున్న రుధిరం
నిను ముంచివేసెనయ్యా దోషరహితుడా హేతువు లేక
నిను ద్వేషించిరయ్యా - పగబట్టి చంపిరయ్యా

ఏ దరిగానక - తిరిగిన నన్ను - నీ దరి చేర్చితివా
మార్గము నీవై సత్యము నీవై - జీవము నీవైతివి
నా సర్వము నీవైతి

6 comments: