Index-Telugu

Wednesday, 10 August 2016

183. Maranidi Maruvanidi Viduvanidi Edabayanidi

మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది ||2||
ప్రేమా యేసయ్య ప్రేమా ||4||

నేను మరచిన గాని నన్ను మరవనన్న ప్రేమా
నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమా ||2||
నేను పడిపోతుంటే నన్ను పట్టుకున్న ప్రేమా
తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమా ||2||

తల్లి మరచిన గాని నన్ను మరవనన్ను ప్రేమా
తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమా ||2||
నేను ఏడుస్తుంటే నన్ను ఎత్తుకున్న ప్రేమా
తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమా ||2||

నేను పుట్టక ముందే నన్ను ఎత్తుకున్న ప్రేమా
నేను ఎరుగక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమా ||2||
అరచేతుల్లో నన్ను చెక్కుకున్న ప్రేమా
ఎద లోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమా ||2||

2 comments: