Index-Telugu

Tuesday, 2 August 2016

96. Halleluya Padeda Prabhu Ninnu Koniyadedan

హల్లెలూయ పాడెద... ప్రభు నిన్ను కొనియాడెదన్‌
అన్ని వేళలయందున - నిన్ను పూజించి కీర్తింతున్‌
ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్‌

1. వాగ్ధానముల నిచ్చి - నెరవేర్చువాడవు నీవే
నమ్మకమైన దేవా - నన్ను కాపాడువాడవు నీవే
ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్‌ ||హల్లె||

2. నాదు శత్రువులను - పడద్రోయువాడవు నీవే
మహా సామర్ధ్యుండవు - నా రక్షణశృంగము నీవే
ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్‌ ||హల్లె||

3. ఎందరు నిన్ను చూచిరో - వారికి వెలుగు కలిగెన్‌
ప్రభువా నే వెలుగొందితిన్‌ - నా జీవంపు జ్యోతివి నీవే
ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్‌ ||హల్లె||

4. భయము పారద్రోలి - అభయము నిచ్చితివి
ఎబినేజరు నీవై ప్రభు - నన్ను సంరక్షించుచుింవి
ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్‌ ||హల్లె||

5. కష్టములన్నింని - ప్రియముగా భరియింతును
నీ కొరకే జీవింతును - నా జీవంపు దాతవు నీవే
ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్‌ ||హల్లె||

No comments:

Post a Comment