Index-Telugu

Tuesday, 2 August 2016

97. Halleluya Pata Yesayya Pata

హల్లెలూయా పాట - యేసయ్య పాట
పాడాలి ప్రతిచోట - పాడాలి ప్రతినోట
హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయా

1. కష్టాలెన్ని కల్గినా - కన్నీరులే మిగిలినా
స్తుతి పాటలే పాడుమా - ప్రభు యేసునే వేడుమా
ప్రభు యేసునే వేడుమా

2. చెరసాలలో వేసినా - సంకెళ్ళు బిగించినా
స్తుతి పాటలే పాడుమా - ప్రభు యేసునే వేడుమా
ప్రభు యేసునే వేడుమా

3. నీ తల్లి నిను మరిచినా - మరువడు నీ దేవుడు
స్తుతి పాటలే పాడుమా - ప్రభు యేసునే వేడుమా
ప్రభు యేసునే వేడుమా

4. శోధనలు నిను చుట్టినా - సంతోషమే తట్టినా
స్తుతి పాటలే పాడుమా - ప్రభు యేసునే వేడుమా
ప్రభు యేసునే వేడుమా

5. సింహాల కెరవేసినా - అగ్నిలో పడవేసినా
ధీరుడవై సాగుమా - ప్రభు సిల్వనే చాటుమా
ప్రభు సిల్వనే చాటుమా

2 comments: