Index-Telugu

Tuesday, 20 June 2017

275. Nirantharam Nithone Jivinchalane Asa

నిరంతరం నీతోనే జీవించాలనే
ఆశ నన్నిల బ్రతికించుచున్నది
నా ప్రాణేశ్వరా.. యేసయ్యా
నా సర్వస్వమా.. యేసయ్యా             II నిరంతరంII

చీకటిలో నేనున్నప్పుడు
నీ వెలుగు నాపై ఉదయించెను (2)
నీలోనే నేను వెలగాలనీ
నీ మహిమ నాలో నిలవాలనీ (2)
పరిశుద్ధాత్మ అభిషేకముతో
నన్ను నింపుచున్నావు నీ రాకడకై     II నిరంతరంII

నీ రూపము నేను కోల్పోయినా
నీ రక్తముతో కడిగితివి (2)
నీతోనే నేను నడవాలనీ 
నీవలెనే నేను మారాలనీ (2)
పరిశుద్ధాత్మ వరములతో
అలంకరించుచున్నావు నీ రాకడకై     II నిరంతరంII

తొలకరి వర్షపు జల్లులలో
నీ పొలములోనే నాటితివి (2)
నీలోనే నేను చిగురించాలనీ
నీలోనే నేను పుష్పించాలనీ (2)
పరిశుద్ధాత్మ వర్షముతో
సిద్ధపరచుచున్నావు నీ రాకడకై         II నిరంతరంII

No comments:

Post a Comment