Index-Telugu

Tuesday, 20 June 2017

276. Nenu Nijamaithe Na Athma Nijamouna

నేను నిజమైతే నా ఆత్మ నిజమౌనా
నా ఆత్మ నిజమైతే పరమాత్మ నిజమౌనా
నేను నిజమైతే నా ఆత్మ నిజమౌనా

కట్టె వంటిది ఈ దేహం నిప్పు వంటిది ఆత్మ
కట్టెకు వంకరలుండును కాని నిప్పుకు వంకరలుండునా
కట్టె వంటివాడు దాసుడైతే నిప్పు వంటివాడు నా యేసు

ఏటి వంటిది ఈ దేహం నీటి వంటిది ఆత్మ
ఏటికి వంకరలుండును కాని నీటికి వంకరలుండునా
ఏటి వంటివాడు దాసుడైతే నీటి వంటివాడు నా యేసు

ఆవు వంటిది ఈ దేహం పాలవంటిది ఆత్మ
ఆవుకు రంగులుండును కాని పాలకు రంగులుండునా
ఆవు వంటివాడు దాసుడైతే పాల వంటివాడు పరలోకపుతండ్రి

No comments:

Post a Comment