Index-Telugu

Tuesday, 23 January 2018

342. NIve Yani Nammika Yesu Naku Nive Yani Nammika

నీవే యని నమ్మిక
యేసునాకు నీవే యని నమ్మిక
నీవే మార్గంబు నీవే సత్యంబు
నీవే జీవంబు - నీవే సర్వంబు                     
IIనీవేII

పెడాదారిని బోవగా
నామీదికి ఇడములెన్నియో రాగ
అడవిలో బడి నేను- అడలుచునుండంగ
తడవకుండ దొరుకు - ధన్యమౌ మార్గంబు    
IIనీవేII

తడవని దారి దొరుక
దానింబడి నేనడచుటెట్లో తెలియక
జడియుచుండగ నన్ను - జాగ్రత్తగా కడకు
నడిపించుకొని వెళ్ళు – నయమార్గదర్శిని    
IIనీవేII

కారు మేఘము పట్టగ
నా మనస్సులో కటిక చీకటి పుట్టగ
ఘోరాపదల జేరి - దారియని భ్రమపడగ
తేరిచూడగల్గు - తేజోమయ మార్గంబు        
IIనీవేII

లేనిపోని మార్గంబు
లెన్నోయుండ - జ్ఞానోపదేశంబు
మానుగజేయుచు - వానిని ఖండించి
నేనే మార్గంబన్న - నిజమైన మార్గంబు      
IIనీవేII

ఎటుజూచిన మార్గములే
మోసముచేయు - హీనశత్రువర్గములే
ఎటుబోవవలయునో నే - నెరుగనివాడనై
కటకటయని యేడ్వ - ఘన మోక్ష మార్గంబు    
IIనీవేII

జబ్బు మరల ముదరగ
కల ధైర్యంబు - జారి గుండెలదరగా
నిబ్బరముగా మనసు నిలువక యున్నప్పుడు
దబ్బున నను జేర్చు - దయగల వైద్యుడవు    
IIనీవేII

నరలోకము నుండి
పరలోకంబు వరకు నిచ్చెనగా నుండి
నరులకు ముందుగా - నడచుచు ముక్తికి
సరిగాకొనిపోవు - సుస్థిరమైన మార్గంబు        
IIనీవేII

ధైర్యంబుగా నుండుము
ఓ విశ్వాసి - ధైర్యంబుగా నుండుము
ధైర్యంబుతో దేవుని ఆత్మతో స్తుతియించి
వచ్చిన శ్రమలలో – ఆనందించుము            
IIనీవేII

నీకుతోడై యుంటిని
నీ మనవిని ఆలించియుంటిని
అన్నిటి నుండి నిన్ ఆదరించిన తండ్రిన్
ఆనందముతో - స్తోత్రించు చుండుము        
IIనీవేII

No comments:

Post a Comment