Index-Telugu

Tuesday, 23 January 2018

343. Manovicharamu Kudadu Niku Mahima Thalampule Kavalenu

మనోవిచారము కూడదు నీకు
మహిమ తలంపులే కావలెను
దినక్రమాన శాంతి గుణంబులు
దీనులకిచ్చుచుందును

ఆలస్యమైనంత మాత్రమున
అవి నెరవేర వనవద్దు
కాలము పరిపూర్ణంబుకాగా
ఖచ్చితముగ అన్నియు నెరవేరును

నిత్యానందము సత్యానందము
నీలోనేనమర్చితి
అత్యానందము అగపడుచుండును
ఆలోచించుచున్న కొలది

కోరవు నీకు కావలసినవి
ఊరకనె నీకిచ్చెదను
ధారాళముగ నిచ్చుటకు నా ధననిధి
వస్తువులన్నియు గలవు

నీరసపడకుము నీరసపడకుము
నీవె నా ఆస్తిగదా
నారక్తముతో సంపాదించితి
నన్ను నీ ఆస్తిగ గైకొనుము

ఆనందతైలముతో నిన్ను
అభిషేకించి యున్నాను
స్నానము ప్రభు భోజనము ప్రజలకు
జరుపుట సరియని అనుచున్నాను

నీకు కావలసినవి అడుగుము
నేను తప్పక ఇచ్చెదను
నీకు ఇచ్చుట నాకానందము
నీవు అడుగుట ముచ్చటనాకు

నీ కష్టములు నీ కోరికలు
నాకెరుకె అవి యుండవుగా
లేకుండగా జేసెదను అప్పుడు
లేడివలె గంతులు వేయుదువు

నీకవసరమైనవి కావలసిన
నిఖిల వస్తువుల కాజ్ఞాపింతును
కాకులకాజ్ఞయిచ్చి
ఏలియాకు ఆకలితీర్చలేదా

సైకిళ్ళు స్టీమర్లు బండ్లు
సంచారమునకు అవసరమా
లోకులు కోరిన యెడల అవియు
నీకవి సుళువుగ లభియించు

ఎండయు చలియు వానయు గాలియు
ఏమియు చేయ నేరవు నిన్ను
తిండికి బట్టకు బసకు శద్ధికి
తీరికకు యే కొదువయె యుండదు

జంతువు పశువు పురుగు పక్షి
జబ్బు ఏమియు చేయవు నీకు
సంతోషముతో నా సందేశము
చాటగ అదియు చాటుచునుండుము

నీ బలహీనత తట్టుచూడకు
నా బలము తట్టిదిగో చూడుము
నీ బలమునకు మించిన పనులు
నా బలమేగదా చేయవలెసెను

పాపివని నీకెవడు చెప్పెను
పావనుడవై యుండగను
శాప మరణమురాదు నీకు
చావును చంపిన జీవము నేనే

నా రూపలావణ్యములు
నీ రూప లావణ్యములగును
నా రక్తము ప్రతి నిమిషము నీలో
ధారగ ప్రవహించును అది జీవము

2 comments: