Index-Telugu

Tuesday, 23 January 2018

348. Deva Devuni Morkkalendi O Priyulara Deva Rajuni Golva Randi

దేవ దేవుని మ్రొక్కలెండి
ఓ ప్రియులారా దేవరాజుని గొల్వరండి
లేవంగానే తర్వగా దేవుని స్మరియించి
ఆ వెనుక మీ పనులు ఆరంభించుట మేలు || దేవ ||

మంచము దిగగానె మొదట
మోకాళ్ళూని మనతండ్రిని తలంచుకొనుట
మంచి పనులన్నిటిన్ మించిన పని యౌను
కొంచమైనను బద్దకించుట సరికాదు || దేవ ||

అన్నము తినుటకు ముందు
వందనములు ఆచరించుట గొప్ప విందు
అన్ని దేవుడు మీకు అందించునని నమ్ము
కొన్న యెడల అందుకొందురానందముతో || దేవ ||

పయనమై ప్రార్ధించుకొండి
దేవుడు మిమ్ము పదిలమ్ముగా నడుపునండి
భయము కల్గదు మీ బాట చదునైయుండు
రయముగా వెళ్ళుదురు రంజిల్లు మీ మనస్సు || దేవ ||

ఆపదలో ప్రార్ధించుకొండి అది తప్పును
అపుడాయనను స్తుతించండి
మీపైన దేవునికి మెండైన ప్రేమయని
ఈ పనిలో మీరు గ్రహించు కొనవలయును || దేవ ||

ఇబ్బందిలో ప్రార్ధించండి అది తీరును
ఎంతో సంతుష్టి పొందండి
జబ్బులో ప్రార్ధించి స్వస్థత నొందండి
అబ్బును దేవుని ఆశ్రయించెడి వాలు || దేవ ||

దేవుడే మన మానవుఁడై
యేసుక్రీస్తుగా వెలసి తిరిగెనీ యిలపై
చావొంది చావును చంపి జీవించెను
కావున మనకు మోక్షంబు నమ్మిన యెడల || దేవ ||

ఎన్ని తిరిగిన పోవు పోవు పాపంబులు
ఎంత ఏడ్చిన పోవు పోవు
ఎన్నాళ్ళు పుణ్యక్రియ లెన్నిచేసిన పోవు
అన్ని చేసిన క్రీస్తునందు నమ్మిన గాని || దేవ ||

No comments:

Post a Comment