Index-Telugu

Tuesday, 23 January 2018

349. Prardhana Vinedi Pavanuda Prardhana Maku Nerpumaya

ప్రార్థన వినెడి పావనుడా
ప్రార్థన మాకు నేర్పుమయా                ||ప్రార్థన||

శ్రేష్ఠమైన భావము గూర్చి
శిష్య బృందముకు నేర్పితివి
పరముడ నిను ప్రణుతించెద ప్రియముగ
పరలోక ప్రార్థన నేర్పుమయా            ||ప్రార్థన||

పరమ దేవుడవని తెలిసి
కరము లెత్తి జంటగా మోడ్చి
శిరమునువంచి సరిగను వేడిన
సుంకరి ప్రార్థన నేర్పుమయా           ||ప్రార్థన||

దినములోన చేసిన సేవ
దైవ చిత్తముకు సరిపోవ
దీనుడవయ్యు ఒంటిగ కొండపై
చేసిన ప్రార్థన నేర్పుమయా           ||ప్రార్థన||

శ్రమలు యేసువా చుట్టుకొని
శత్రుమూక నిను పట్టగను 
శాంతముతో శరణని వేడిన
గెత్సెమనె ప్రార్ధన నేర్పుమయా   ||ప్రార్థన||

No comments:

Post a Comment