Index-Telugu

Tuesday, 27 March 2018

421. Rammanuchunnadu Ninnu Prabhu Yesu

రమ్మనుచున్నాడు నిన్ను ప్రభుయేసు
వాంఛతో తన కరము చాపి పిలచుచున్నాడు

ఎటువంటి శ్రమలందునూ ఆదరణ నీకిచ్చునని
గ్రహించి నీవు యేసుని చూచిన
హద్దులేని యింపు నొందెదవు

కన్నీరంతా తుడుచును కనుపాపవలె కాపాడున్‌
కారుమేఘమువలె కష్టములు వచ్చినను
కనికరించి నిన్ను కాపాడును

సొమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును
ఆయన నీ వెలుగు రక్షణ అయినందున
ఆలసింపక నీవు తర్వపడి రమ్ము

సకల వ్యాధులను స్వస్థపరచుటకు
శక్తిమంతుడగు ప్రభుయేసు ప్రేమతో
అందరికి తన కృపల నిచ్చును

No comments:

Post a Comment