Index-Telugu

Tuesday, 27 March 2018

422. Sahodarulu Ikyatha Kaligi Nivasinchuta

       సహోదరులు ఐక్యత కలిగి నివసించుట
       ఎంతమేలు ఎంత మనోహారం
       ఎంత మధురం ఎంత సంతోషం

 1.    నీతిమంతులు ఖర్జూర వృక్షముల వలెను
       మొవ్వ వేయుచు దినదినం వర్ధిల్లెదరు      ||2||
       లెబానోను పర్వతముపై దేవదారు వృక్షాలవలెను
       దేవుని సన్నిధిలో నిలిచి ఉండెదరు   ||2||

2.    దినములు చెడ్డవి గనుక సమయం పోనియ్యక
       వినయ మనస్సుతో ప్రభు సన్నిధిలో వేడుదము ||2||
       అజ్ఞానుల వలెకాక జ్ఞానుల వలె మనము
       యేసయ్య బాటలో పయనించెదము  ||2||

No comments:

Post a Comment