Index-Telugu

Wednesday, 4 April 2018

478. Na Priyuda Na Priya Yesu

నా ప్రియుడా నా ప్రియ యేసు
నా వరుడ పెళ్ళికుమారుడా
ఎప్పుడయ్యా లోక కళ్యాణము
ఎక్కడయ్యా (ఆ) మహోత్సవము
మధ్య ఆకాశమా మహిమ లోకాననా ||2||

నరులలో నీవంటి వారు
ఎక్కడైనా నాకు కానరారు
నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం
పరలోక సౌందర్య తేజోమయుడ
పదివేలలో అతి సుందరుడ

సర్వాన్ని విడిచి నీ కొరకు రాగ
నా ప్రాణ ప్రియుడా నా కెదురొచ్చినావా
నే విడచిపోక నిను హత్తుకొంటి
పరలోక సౌందర్య తేజోమయుడ
పదివేలలో అతి సుందరుడ

11 comments: