Index-Telugu

Wednesday, 4 April 2018

479. Na Yesu Raju Vastunnadu Kotanu Koti Duthalatho

నా యేసు రాజు వస్తున్నాడు
కోటాను కోటి దూతలతో
నా విమోచకుడు వస్తున్నాడు
నన్ను పాలించుట కొస్తున్నాడు     IIనాII

పరమందు స్థలమేర్పరచి
పరిశుద్ధులతో వస్తున్నాడు
పరమందు నను జేర్చుటకై
ఇదిగో త్వరగా వస్తున్నాడు              IIనాII

ప్రధాన దూత శబ్ధముతో
ప్రభావ ఘన మహిమలతో
పరలోకము నుండి ప్రభువు
ఇదిగో త్వరగా వస్తున్నాడు             IIనాII

జయశీలుడగు ప్రభుయేసు
జీవంబు నిచ్చిన రాజు
జీతంబు నాకీయుటకు
ఇదిగో త్వరగా వస్తున్నాడు              IIనాII

రాజులరాజు యేసయ్యా
రక్షించు ప్రభు యేసయ్య
రాజ్యము వెయ్యేండ్లు చేయ
ఇదిగో త్వరగా వస్తున్నాడు             IIనాII

No comments:

Post a Comment