Index-Telugu

Wednesday, 4 April 2018

489. Paradesulamo Priyulara Mana Puramidi Gadepudu

పరదేశులమో ప్రియులారా మన
పురమిది గాదెపుడు (నిజముగ) 
చిత్ర వస్తువులు చెల్లెడి యొకవి
చిత్రమైన సంత (లోకము) 
సంత గొల్లు క్షమ సడలిన చందం
బంతయు సద్దణగన్ (నిజముగ) 
స్థిరమని నమ్మకు ధర యెవ్వరికిని
బరలోకమే స్థిరము (నిజముగ) 
మేడలు మిద్దెలు మేలగు సరకులు
పాడై కనబడవే (నిజముగ) 
ధర ధాన్యంబులు దరగక మానవు
పని పాటలు పోయె (నిజముగ)
ఎన్ని నాళ్ళు మన మిలలో బ్రతికిన
మన్నై పోవునుగా (దేహము) 
వచ్చితి మిచటికి వట్టి హస్తముల
దెచ్చిన దేదియు లే (దు గదా)
ఎట్లు వచ్చితిమి ఈ లోకమునకు
అట్లు వెళ్ళవలయున్ (మింటికి) 
యేసు నందు విశ్వాసం బుంచిన
వాసిగ నిను జేర్చున్ (బరమున) 
యేసే మార్గము యేసే సత్యము
యేసే జీవముగా (నిజముగ) 

3 comments:

  1. Thanks brother. God bless you.

    ReplyDelete
  2. Nice song akka/ Anna ... please send audio of the Full song

    ReplyDelete