Index-Telugu

Wednesday, 4 April 2018

494. Pakshiraju vale Rekkalu Chapi Paikeguruduma

పక్షిరాజువలె రెక్కలు
చాపి పైకెగురుదామా
అలయక సొమ్మసిల్లక పైకెగురుదామా
ఆ శాశ్వత లోకము కొరకు
నిత్యరాజ్యము కొరకు

ఈ లోక స్నేహితులు
ఈ లోక బంధువులు
జన్మనిచ్చిన తల్లిదండ్రులు
ఎవరులేక ఒంటరిస్థితిలో
ప్రేమలన్ని కోల్పోయినా క్రీస్తేసు
ప్రేమలో సాగిపోదమా

ఈ లోక పోరాటము సాతాను శోధనలు
హృదయమును కృంగదీసినా
అడుగడుగున
సంకెళ్ళతో అడుగువేయలేకున్నా
క్రీస్తేసు ప్రేమలో ఎగిరిపోదమా

ఆ మహిమ రాజ్యములో
ఆ నిత్య రాజ్యములో
కన్నీరుండదు దిగు లుండదు
ఎల్లప్పుడు సంతోషముతో ఎల్లప్పుడ
ు ఆనందముతో హల్లేలూయా
గీతాలతో నిలిచిపోదుమా

No comments:

Post a Comment