496. Priya Yesu Rajunu Ne Chuchina Chalu
ప్రియ యేసు రాజును నే చూచిన చాలు
మహిమలో నేనాయనతో ఉంటే చాలు
నిత్యమైన మోక్షగృహము నందు చేరి
భక్తుల గుంపులో హర్షించిన చాలు
యేసుని రక్తమందు కడుగబడి
వాక్యంచే నిత్యం భద్రపరచబడి
నిష్కలంక పరిశుధ్దులతో పేదన్ నేను
బంగారు వీదులలో తిరిగెదను
ముండ్ల మకుటంబైన తలను జూచి
స్వర్ణ కిరీటం బెట్టి ఆనందింతున్
కొరడాతో కొట్టబడిన వీపున్ జూచి
ప్రతి యొక్క గాయమును ముద్దాడెదన్
హృదయము స్తుతులతో నింపబడెను
నా భాగ్య గృహమును స్మరించుచు
హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ
వర్ణింప నా నాలుక చాలదయ్యా
ఆహ ఆ బూర ఎప్పుడు ధ్వనించునో
ఆహ నా ఆశ ఎప్పుడు తీరుతుందో
తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో
ఆశతో వేచియుండే నా హృదయం
No comments:
Post a Comment