Index-Telugu

Friday, 6 April 2018

500. Siyonu Patalu Santhoshamuga Paduchu Siyonu Velludamu


       సీయోను పాటలు సంతోషముగను 
       పాడుచు సీయోను వెళ్ళుదము

1.     లోకాన శాశ్వతానంద మేమియు 
       లేదని చెప్పెను ప్రియుడేసు
       పొందవలెనీ లోకమునందు 
       కొంతకాల మెన్నో శ్రమలు

 2.   ఐగుప్తును విడచినట్టి మీరు 
      అరణ్యవాసులె ఈ ధరలో
      నిత్య నివాసము లేదిలలోన 
      నేత్రాలు కానానుపై నిలుపుడి

 3.   మారాను పోలిన చేదైన స్థలముల 
      ద్వారా పోవలసియున్న నేమి
      నీ రక్షకుండగు యేసే నడుపును 
      మారని తనదు మాట నమ్ము

 4.   ఐగుప్తు ఆశలన్నియు విడిచి 
      రంగుగ యేసుని వెంబడించి
      పాడైన కోరహు పాపంబు మాని 
      విధేయులై విరాజిల్లుడి

5.   ఆనందమయ పరలోకంబు మనది 
      అక్కడ నుండి వచ్చునేసు
     సీయోను గీతము సొంపుగ కలసి 
     పాడెదము ప్రభు యేసుకు జై

7 comments: