499. Siyonu Desamulo Cheri Priyunitho Jivinthunu
సీయోను
దేశములో చేరి
ప్రియునితో జీవింతును
జయగీతం బహుఇంపు
స్తుతిపాడి సంతోషింతును
1. నగరపు వీధులలో
బంగారము మెరయుచుండును
రాత్రి పగలు లేవు
నా రక్షకుడే వెలుగును
2. నా కన్నీరంతయు
తుడిచివేయునేసు
కలత లేదక్కడ
నా ప్రియునితో ఆనందమే
3. నిత్యము నా ప్రియుని
స్తుతించి పాడెదను
మహిమా యుతుని దేశములో
మహిమతో జీవింతును
No comments:
Post a Comment