Index-Telugu

Wednesday, 3 July 2019

506. Siyonulo Nundi Neevu Prakasinchuchunnavu Napai


సీయోనులో నుండి నీవు  
ప్రకాశించుచున్నావు నాపై   
సమాధానమై - సదాకాలము నను నీతో  
నడిపించుచున్నావు నీకీర్తికై   
సీయోనులో మహోన్నతుడా యేసయ్యా   
నిర్దోషమైన మార్గములో 
నా అంతరంగమున ధైర్యమునిచ్చి 
నీ సన్నిధిలో ననునిలిపి 
ఉన్నత విజయమునిచ్చితివి 
నీ ఆశలు నెరవేరుటకు నీ చిత్తము జరిగించుటకు 
విడువవు నను యెడబాయవు 
నీవు విడువవు నను యెడబాయవు 
నాయందు దృష్టినిలిపి 
నీస్నేహబంధముతో ఆకర్షించి 
కృపావరములతో ననునింపి 
సత్యసాక్షిగా మార్చితివి 
నీ మనస్సును పొందుకొని నీ ప్రేమను నింపుకొని 
కీర్తిoచెదను ప్రతినిత్యం 
నిను ఆరాధింతును అనుక్షణము
నీదివ్యమైన మహిమను
పరలోకమందునే చూచెదను 
నీ కౌగిలిలొ చేర్చుకొని
ప్రతిభాష్పబిందువును తుడిచెదవు 
నీ మాటల మకరందమును
మరపురాని అనుబంధమును 
మరువను ఎన్నడు విడువను 
నేను మరువను ఎన్నడు విడువను

No comments:

Post a Comment