Index-Telugu

Wednesday, 17 July 2019

507. Samipincharani Tejassulo Neevu Vasiyinchu Vadavaina


సమీపించరాని తేజస్సులో నీవు
వసియించు వాడవైనా
మా సమీపమునకు దిగి వచ్చినావు
నీ ప్రేమ వర్ణింప తరమా (2)
యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది
యేసయ్యా నీ కృప ఎంత విలువైనది (2)  ||సమీ||
ధరయందునేనుండ 
చెరయందు పడియుండ
కరమందు దాచితివే
నన్నే పరమున చేర్చితివే (2)
ఖలునకు కరుణను నొసగితివి (2)      
యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది
యేసయ్యా నీ కృప ఎంత విలువైనది (2)  ||సమీ||
మితి లేని నీ ప్రేమ గతి లేని నను చూచి
నా స్థితి మార్చినది నన్నే శ్రుతిగా చేసినది (2)
తులువకు విలువను ఇచ్చినది (2)    
యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది
యేసయ్యా నీ కృప ఎంత విలువైనది (2)    ||సమీ||

No comments:

Post a Comment