🎶 అసామానుడైన వాడు 🎶
అసామానుడైన వాడు
అవమానపరచడు నిన్ను
ఓటమి ఎరుగనీ మన దేవుడు
ఒడిపోనివ్వడు నిన్ను
ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు
కష్టకాలమందు
నీ చేయి విడచునా
అసాధ్యములెన్నో దాటించిన నాథుడు
శ్రమలో నిన్ను దాటిపోవునా
సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు
కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును
అగ్ని గుండాములో నెట్టివేసిన
సింహాల నోటికి నిన్ను అప్పగించిన
శత్రువే నీ స్థితి చూసి అతిశయ పడుచున్న
సింహాలే నీ ఎదుటే మ్రింగివేయ నిలిచిన
నాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమా
తేరిచూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై
శత్రువు చేతికి నిను అప్పగించడు
పరిస్థితులన్నీ చేజారిపోయిన
ఎంతగానో శ్రమపడిన ఫలితమే లేకున్నా
అనుకున్నవన్నీ దూరమైపోయిన
మంచిరోజులొస్తాయనే నిరీక్షణే లేకున్నా
మారదీ తలరాతని దిగులుపడకుమా
మారాను మధురముగా మార్చును నీకై
మేలులతో నిను తృప్తిపరచును
ఒంటరి పోరాటమే విసుగురేపిన
పొందిన పిలుపే బారమైపోయిన
ఆత్మీయులందరు అవమానిస్తున్న
నమ్మదగినవారులేక నిరాశతో నిలిచిన
పిలుపునే విడచి మరలిపోకుమా
న్యాయాధిపతియే నాయకునిగా
నిలుపును నిన్ను
పిలిచిన దేవుడు నిను మరచిపోవునా

No comments:
Post a Comment