🎶 కలవంటి నీ జీవితం 🎶
కలవంటి నీ జీవితం
క్షణభంగురమని యెరుగుము ఓ యువత
అలవంటి నీ యౌవ్వనం
ఎగసిపడే చందము ఓ స్నేహిత (2)
శాశ్వతుడగు యేసును నీవు చేరవా
స్థిరమైన మనస్సును నీవు పొందవా (2) "కల"
కనిపించు ఈలోకం అది ఎంతో రంగుల వలయం
పరుగెత్తు నీ మనస్సుతో
బ్రతుకంత దుర్భరమగును (2)
అదిచేర్చును నిన్ను భ్రమలసుడులకు
నడిపించును నిన్ను చావుకోరలకు (2) "కల"
క్షణమైన నీ కాయం కలిగించును ఆశలు ఎన్నో
నడిపించు నీ మనస్సును సాతాను ఒడిలోకి (2)
భ్రమలన్నీ వదిలి బ్రతుకంతా మార్చుకో
మది నీవు త్రిప్పుకొ ప్రభును చేరుకో (2) "కల"
నీకోసం ఆ యేసయ్య రక్తమడుగులో మ్రానుపై
నీ మనస్సు విడుదల కొరకై
తన ప్రాణము ఇచ్చెనుగా (2)
వెంటాడు ప్రభుని వాక్యము ప్రతిదినము
పరుగు ఎత్తు క్రీస్తుతో ప్రతిస్థలములో (2) "కల"

No comments:
Post a Comment