Tuesday, 23 January 2018

334. Margamu Chupumu Intiki Na Thandri Intiki

మార్గము చూపుము ఇంటికి - నాతండ్రి ఇంటికి
మాధుర్య ప్రేమాప్రపంచము - చూపించు కంటికి

పాప మమతలచేత పారిపోయిన నాకు ప్రాప్తించె క్షామము
పశ్చాత్తాపమునొంది తండ్రి క్షమగోరుచు పంపుము క్షేమము
ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము

ధనమే సర్వంబనుచు సుఖమే స్వర్గంబనుచు తండ్రిని వీడితి
ధరణీబోగములెల్ల బ్రతుకు ధ్వంసముజేయ దేవా నినుచేరితి
దేహి అని నీవైపు చేతులెత్తిన నాకు దారిని జూపుము

దూరదేశములోన బాగుండు ననుకొనుచు తప్పితి మార్గము
తరలిపోయిరి నేను నమ్మిన హితులెల్ల తరిమె దారిద్య్రము
దాక్షిణ్యమూర్తి నీ దయ నాపై కురిపించి ధన్యుని జేయుము

అమ్ముకొంటిని నన్ను అధముడొకనికి నాదు ఆకలి బాధలో
అన్యాయమయిపోయె పందులు సహ వెలివేయ అలవడెను వేదన
అడుగంటె అవినీతి మేల్కొనియే మానవత ఆశ్రయము జూపుము

కొడుకునే కాదనుచు గృహమే చెరసాలనుచు కోపించి వెళ్ళితి
కూలివానిగనైన నీయింట పనిచేసి కనికరమే కోరుదున్
కాదనకు నాతండ్రి దిక్కెవ్వరును లేరు క్షమియించి బ్రోవుము

నాతండ్రి ననుజూచి పరుగిడుచు ఏతెంచి నాపైబడి యేడ్చెను
నవజీవమును కూర్చి ఇంటికి తోడ్కొనివెళ్ళి నన్ను దీవించెను
నాజీవిత కధయంత యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమైయుండును

6 comments:

Neevu Thappa Nakevaru Unnarayya Lyrics in Telugu | Christian Song #591

Neevu Thappa Nakevaru Unnarayya Lyrics in Telugu | Christian Song #591 Song No: 591 Language: Telugu Category: Worship Song 🎵 Te...