Tuesday, 23 January 2018

341. Ninu Namminacho Siggu Padaniyavu Nanu Nemmaditho Nive Unchedadvu

నిను నమ్మినచో – సిగ్గుపడనీయవు
నను నెమ్మదితో - నీవె ఉంచెదవు
ఆపత్కాలమున - నమ్ముకొనదగిన
యేసూ నీవే - ఆధారము
యేసూ నీవే - నా ప్రాణము

తెలివిని నమ్ముకొని పడ్డాను
బుద్ధిజ్ఞానము నీ దానమని నీ చెంతకు చేరాను ||యేసూ||

బలమును నమ్ముకొని భంగపడ్డాను
శక్తిమంతుడా నా కోటవని నీ చెంతకు చేరాను ||యేసూ||

ధనమును నమ్ముకొని దగా పడ్డాను
సుఖసంపద నీ దీవెనని నీ చెంతకు చేరాను ||యేసూ||

మనుష్యుల నమ్ముకొని మభ్యపడ్డాను
సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను||యేసూ||

No comments:

Post a Comment

Sarvadhikariyaina Sarva Sakthimanthudu | Telugu Christian Song # 604

ఏదైనా సాధ్యమే | Telugu Christian Song ✨ ఏదైనా సాధ్యమే ✨ సర్వాధికారియైన సర్వశక్తిమంతుడు అధిక ప్రేమామయ...

About Me

My photo
I’m Gnana Ratnam Veladuti, a devoted Christian sharing devotional messages and sermons. My goal is to encourage believers to stay strong in faith.

📌 Follow my blog for daily inspiration and spiritual encouragement.