Index-Telugu

Friday, 6 April 2018

498. Srungara Nagaramandu Jayagithamul Padedamu


      శృంగార నగరమందు 
      జయగీతముల్‌ పాడెదము
      సీయోను వరుని జేరి

1.    ఆనంద మిచ్చిన ప్రియుని చేరి 
      ఆదరణ పొందెదము
      అచట అలంకార మహిమ 
      కిరీటం పొంది
      ప్రియునితో - హర్షించెదం

 2.  దుఃఖించువారు స్తుతిపాట పాడుచు 
      స్తుతి వస్త్రములతో
      అచట ఉన్నత సీయోను 
      తిన్నని వీధిలో
      హర్షించి - స్తుతి పాడెదం

 3.  ముండ్ల కిరీటము పొందిన నిజయేసు 
     పరిశుద్ధుని చూతుము
     అచ్చట ముద్ర పొందిన 
     శుద్ధులు తెల్ల అంగి
     ధరించి స్తోత్రించెదం

 4. భూలోక పాలన క్రొత్తపాట పాడి 
     ప్రేమలో హర్షించెదం
     శాంతి సౌఖ్యంబు తోడ 
     ప్రభువుతో నుండ
     భూ ఆశల్‌ విడచుదము

5.   ఆయన చెప్పిన గుర్తులన్నియు 
     తప్పక జరుగుచుండె
     ఆయన వచ్చువేళ 
     తెలియదు ఎపుడో
     ఆయత్తముగ - నుందుము

6.   సిలువను మోసిన పరిశుద్ధుడగు 
     యేసు చెంత చేరుకొందము
     అచ్చట మచ్చాడాగులేని 
     ప్రభుని వెంబడించి
     జయగీతముల్‌ పాడెదం

1 comment: