స్తుతి సింహాసనాసీనుడా - నా ఆరాధనకు యోగ్యుడా ||2|| నాలో నీవుండగ నీలో నేనుండగ - ఇక నేనేల భయపడుదును ||2||
1.ఆకాశము నీ సింహాసనం - భూమి నీ పాద పీ..ఠం ఆ సింహాసనం విడిచి సిలువకు దిగివచ్చి ప్రాణ త్యాగము చేసి నీ ప్రేమామృతం త్రాగించితివి నిను స్తుతించుటకు బ్రతికించితివి
2.రాజాధిరాజా ప్రభువులకు ప్రభువా - ఎవరు నీకిలలో సా..ి సదాకాలం నిలిచే నీ సింహాసనం జయించిన వారికే సొంతం ఈ జీవన పోరాటంలో నాకు జయమిచ్చుటకు నీకే సాధ్యం
3.నా రాజ్యం లోక సంబంధమైనది - కానే కాదింవే నా షాలేము రారాజ స్థాపించితివి నీ బలముతొ ప్రేమ రాజ్యం మార్పు లేని నీ కృపకు నా ప్రభువా మార్చితివే నీ రాజ్య పౌరునిగ
సింహాసనాశీనుడైన నా దేవా... కొనియాడెదను నిన్నే ఇహమందు సర్వలోకానికి చక్రవర్తి నా దేవా స్తుతియించెదను నిన్నె ప్రతిదినము||2|| జగమంత ఏలుచున్న దేవుడ నీవే నీ ఆధీనంలో నన్ను ఉంచుమయ్యా యుగములకు కీర్తనీయుడవు నీవే నీ ఆత్మను మాపై కుమ్మరించుమయ్యా||సింహా||
1.నీ మాటలో స్వస్థత నీ చూపులో స్వస్థత నీ స్పర్శలో స్వస్థత నిలువెల్ల స్వస్థత||2|| నా దేవా నిను చూచిన క్షణం మైమరచితిని నన్ను నేనే ||2||
2.నీ కృప నా యెడల హెచ్చుగా ఉన్నది నీ విశ్వాస్యత నాలో నిరంతరం నిలుచును ||2|| పక్షిరాజు యౌవ్వనమువలె నా ఆత్మబలము నూతనమగును||2||
3.నీ శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావు నీ రక్షణ శృంగము నన్ను ఆదుకొనును||2|| నే బ్రతుకు దినములన్నియు కృపాక్షేమములే వచ్చును ||2||
యేసు యేసు మా మంచిదేవా నిన్ను మేము కీర్తించెదము
యేసు యేసు మా గొప్ప దేవా నిన్ను మేము ఘనపరచెదము
కరుణామయుడా కనికర హృదయ పరలోక రాజ స్తోత్రములు
ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలమైనదేవా స్తోత్రములు
యేసూ నీ తలపే నాకు ఎంతో హాయి
ప్రభు యేసూ నీ తలపే నాకు ఎంతో హాయి
యేసు నిను తలంపగానే హృదయ
మానందముతో నిండున్
నీ సముఖమున ముఖము జూచుచు
వాసము చేసినపుడెట్లుండునో
నీ నామస్వర మాధుర్యంబు నా నాలుక పాడంజాలదు
మానసము వర్ణింపనేరదు జ్ఞానశక్తి కనుగొనజాలదు
ఇట్టి ధ్యానము చేయుచుండిన మీలోని భక్తి
గట్టి పడును కాల క్రమమున
ఇట్టి ధ్యానమువలన మీకు ఎట్టి అప్పులైన తీరును
ఇట్టి ధ్యానమువలన మీకు ఎట్టి వ్యాజ్యమైన గెలుచును
ఇట్టి ధ్యానమువలన మీకు ఎట్టి నిందయైన అణగును
ఇట్టి ధ్యానమువలన మీకు ఎట్టి కలహమైన ఆగును
ఇట్టి ధ్యానమువలన మీకు వట్టి మాట వట్టి దగును
మనుష్య కుమారుండు మనుష్యుడే ఆ పద్ధతిన
దేవుని కుమారుడు కూడ దేవుండే
దేవకుమారుని బట్టి దేవుని బిడ్డలము మనము
వాగ్ధానమును బట్టి దేవుని వారసుల మైయున్నాము
యేసుప్రభువు ప్రవక్త యనిన ఏమిచెప్పిన నమ్మవలెను
ఏమతస్థులైన నమ్మిన యేసు మేలు చేయుచుండును
యేసుదేవుడు మన నరుండు ఎంతగానో మురియవలెను
బైబిలునందున్న క్రీస్తుని పావన చరిత్ర చదువుడి
యేసు మనలో నున్నాడు యేసులో మనమున్నాము
యేసునకు మనమే మనకు యేసేయుండును ఏమితక్కువ
ఏ సహాయం లేనప్పుడు ఆ సహాయం నీవై
ఏలియాకు కాకుల ద్వారా ఆహారం నిచ్చితివే
నా సాయం నీవై నా తోడుగ నిలిచితివి
నా తోడువు నీవే నా దేవుడవు
నీకే స్తోత్రం స్తోత్రము నీకే స్తోత్రం స్తోత్రము
మా సర్వానిధి నీవయ్యా
నీ సన్నిధికి వచ్చామయ్యా
బహు బలహీనులము యేసయ్యా
మము బలపరచుము యేసయ్యా
మా రక్షకుడవు మా స్నేహితుడవు
పరిశుద్ధుడవు మా యేసయ్యా
పరిశుద్ధమైన నీ నామమునే
స్తుతియింప వచ్చామయ్యా
మా స్తుతులందుకో యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
మా ప్రియమైన యేసయ్యా
నీవే మార్గము నీవే సత్యము
నీవే జీవము మా యేసయ్యా
జీవపు దాత శ్రీ యేసునాధ
స్తుతియింప వచ్చామయ్యా
మా స్తుతులందుకో యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
మా ప్రియమైన యేసయ్యా
విరిగితివయ్యా నలిగితివయ్యా
కలువరిలో ఓ మా యేసయ్యా
విరిగి నలిగిన హృదయాలతో
స్తుతియింప వచ్చామయ్యా
మా స్తుతులందుకో యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
మా ప్రియమైన యేసయ్యా
నీ కొరకే యేసు నీ కొరకే (3) నా కరములెత్తెదను మోకరించి నా శిరము వంచి నా కరములెత్తెద నీ కొరకే (2) పరిశుద్ధ ఆత్మ రమ్ము (2) నను యేసు పాదము చెంత చేర్చుము పరిశుద్ధ ఆత్మ రమ్ము ||నీ కొరకే||
నా స్తుతుల పైన నివసించువాడా నా అంతరంగికుడా యేసయ్యా (2) నీవు నా పక్షమై యున్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళలా జయమే (2)
నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే అది నా ఊహకే వింతైనది (2) ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి ఎనలేని ప్రేమను నాపై కురిపించావు (2) ||నా ||
ద్రాక్షావల్లి అయిన నీలోనే బహుగా వేరు పారగా నీతో మధురమైన ఫలములీయనా (2) ఉన్నత స్థలములపై నాకు స్థానమిచ్చితివే విజయుడా నీ కృప చాలును నా జీవితాన (2) ||నా ||
నీతో యాత్ర చేయు మార్గములు ఎంతో రమ్యమైనవి అవి నాకెంతో ప్రియమైనవి (2) నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో నిలిచి పది తంతుల సితారతో నిన్నే కీర్తించెద (2) ||నా ||
నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడుము
నా నాధుడేసుని సన్నిధిలోనే సుఖశాంతులు కలవు
యేసయ్యా నా యేసయ్యా
నినువీడి క్షణమైన నేను - బ్రతుకలేను స్వామి IIనాII
యేసులేని జీవితం జీవితమే కాదయ్య
యేసు ఉన్న జీవితం కలకాలం ఉండునయ్య
నిను మరిపించే సుఖమే నాకు ఇలలో వద్దయ్యా
నిను స్మరియించే కష్టమే నాకు ఎంతో మేలయ్యా IIనాII
మంచి దేవుడు యేసు మరచిపోనన్నాడు
మేలులెన్నో నా కొరకు దాచి ఉంచినాడమ్మా
నీవు చూపించే ఆ ప్రేమకు నేను పాత్రుడు కానయ్ య
ఆ ప్రేమతోనే నిరతము నన్ను నడుపుము యేసయ్య
నినువీడి క్షణమైన నేను - బ్రతుకలేను స్వామి IIనాII