Wednesday, 20 July 2016

18. E reethi stutiyinthuno

ఏ రీతి స్తుతియింతునో – ఏ రీతి సేవింతునో
నేరములెంచని వాడా – నాదు నజరేయుడా
తీరము దాటిన వాడా – నాదు గలలీయుడా
నా ప్రాణ నాధుండా – నీదు ప్రాణమిచ్చితివి
నేను నీ వాడనో యేసువా (2)       ||ఏ రీతి||

వెదకి నను ఇల చేరితివి – వెంబడించగ పిలచితివి
రోత బ్రతుకును మార్చితివి – నీదు సుతునిగ జేసితివి (2)  

మహిమ నగరిని విడిచితివి – మంటి దేహము దాల్చితివి
సకల సంపద విడచితివి – సేవకునిగా మారితివి (2)        

ఇంత ప్రేమకు కారణము – ఎరుగనైతిని నా ప్రభువా
ఎన్న తరమా నీ ప్రేమ – సన్నుతించుచు సాగెదను (2)    

 

No comments:

Post a Comment

Preminthunu Prabhuva Ninnu Lyrics | ప్రేమింతును ప్రభువా నిన్ను | Telugu Christian Song Lyrics # 609

ప్రేమింతును ప్రభువా నిన్ను సాంగ్ లిరిక్స్ (Preminthunu Prabhuva Ninnu Lyrics) పల్లవి: ప్రేమింతును ప్రభువా నిన్ను ప్రార్ధింతును ...