Tuesday 20 June 2017

274. Daivathma Rammu Na thanuvuna vralumu

దైవాత్మ రమ్ము - నా తనువున వ్రాలుము
నా జీవమంతయు నీతోనుండ - జేరి వసింపుము

స్వంతబుద్ధితోను - యేసుప్రభుని నెరుగలేను
నే నెంతగ నాలోచించిన విభుని - నెరిగి చూడలేను

స్వంతశక్తితోను - యేసు - స్వామి జేరలేను
నే నెంతనడచిన ప్రభుని కలిసికొని – చెంతజేరలేను

పాప స్థలమునుండి - నీ సువార్త కడకు నన్ను
భువిలో పరమాత్మ నడుపుచుండుము - ఉత్తమ స్థలమునకు

పాపములో మరల - నన్ను పడకుండగ జేసి
ఆ నీ పరిశుద్ధమైన రెక్కల నీడను – కాపాడు

పరిశుద్ధునిజేసి - నీ వరములు దయచేసి
నీ పరిశుద్ధ సన్నిధి జూపుమ - పావురమా వినుమా

తెలివిని గలిగించు - నన్ను దివ్వెగ వెలిగించు
నీ కలిగిన భాగ్యములన్నిటిని నా - కంటికి జూపించు

నన్నును భక్తులను - యేనాడును కృపతోను
నిల మన్నించుము మా పాపరాశులను మాపివేయు దేవా

వందనములు నీకు - శుభ వందనములు నీకు
ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు

1 comment:

578. Nenu Na Illu Na Intivarunu

నేను నా ఇల్లు నా ఇంటి వారందరు మానక స్తుతించెదము (2) నీ కనుపాప వలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం (2) ఎబినేజరే ఎబినేజరే – ఇంత క...