Wednesday 31 August 2016

251. Papameruganatti Prabhuni

పాపమెరుగనట్టి ప్రభుని - బాధపెట్టిరి
శాపవాక్యములను బల్కి - శ్రమలు బెట్టిరి

దరికి వచ్చు వారి జూచి - దాగడాయెను
వెరువకుండ వెళ్ళి తన్ను- వెల్లడించెను.

నిరపరాధియైున తండ్రిని - నిలువ బెట్టిరి
దొరతనము వారి యెదుట - పరిహసించిరి.

తిట్టినను మరల వారిని - తిట్టడాయెను
కొట్టినను మరల వారిని - కొట్టడాయెను.

తన్ను జంపు జనుల యెడల - దయను జూపెను
చెన్నగ దొంగను రక్షింప - చేయి చాపెను.

కాలువలుగ రక్త మెల్ల - గారుచుండెను
పాలకుండౌ యేసు- జాలి బారుచుండెను.


250. Thala Dachukonutaku Needa Ila leni Galaliyavada

తలదాచుకొనుటకు నీడ - ఇలలేని గలలియవాడ
కలకాలమిక నీ కోట - సిలువేన నా చెలికాడ
పరలోక సుఖమును వీడి - నరలోక కరవులమాడి
నిరుపేదగను జీవించి - శరణంబు నొసగితివయ్య       ||తల||

ప్రతిపూట తినుటకు లేక - గతిలేని తెరువరి వోలె
వెతలొందుచునె నడియాడి - హతమార్చితివా నా లేమి
దినమంత తీరికలేని - పనిలోక ప్రజలను గాచి
కనుమూయ కొండలకేగి - కనుగొంటివా నీ పాన్పు      ||తల||

కరకైన బాటలపైన - చురుకైన అడుగులు వేసి
తిరుగాడి గూర్చితి నాకై - విశ్రాంతి గల నీ మార్గం
నిర్వాసిగనె జీవించి - పరలోక జనకుని ఇంట
చిరవాసము మాకీయ - నిర్మింప చనితివ దేవ        ||తల||

249. Kalvari Premanu Thalanchinapudu Kaluguchunnadi Dukham

కల్వరి ప్రేమను తలంచినపుడు 

కలుగుచున్నది దుఃఖం

ప్రభువా నీ శ్రమలను ధ్యానించినపుడు

పగులుచున్నది హృదయం

గెత్సేమనే ఒక తోటలో 

విలపించుచు ప్రార్ధించు ధ్వని

నలువైపుల వినబడుచున్నది 

పగులుచున్నది మా హృదయంబె

కలుగుచున్నది దుఃఖం

మమ్మును నీవలె మార్చుటకై 

నీ జీవమును యిచ్చితివే

నేల మట్టుకు తగ్గించుకొని 

సమర్పించితివి నీ కరములలో

మమ్మును నడిపించుము

248. Edu Matalu Palikinava

ఏడు మాటలు పలికినావా = ప్రభువ - ఏడు ముఖ్యాంశములు - ఎరుక
పరచితివా

1. దేవుండవు కాని యెడల - నిన్ను - తిప్పి చంపువారిన్‌ - క్షమియింప
గలవా = జీవమై యుండని యెడల - నిన్ను - చావు దెబ్బలు గొట్ట
- సహియింప గలవా (లూకా 23:34)

2. రక్షణ కథ నడిపినావా - ఒకరిన్‌ - రక్షించి పరదైసు - కొనిపోయినావా
= శిక్షితునికి బోధింపకనే - శాంతి - లక్షణము చూపుచు -
రక్షించినావా (లూకా 23:43)

3. తల్లికి నొక సంరక్షకుని - నిచ్చి - ఎల్లకరకు మాదిరి - కనపరచినావా
= తల్లికి సృష్టికర్తవై - ప్రేమ తనయుండవై గౌర - వించి యున్నావా
(యోహాను 19:26, 27)

4. నరుడవు కాకున్న యెడల - దేవ - నన్నేల విడిచితి - వని యడిగినావా
= నరుడవును దేవుండవును - గాన - నా పూర్ణ రక్షకుడ - వని
ఋజువైనావా (మార్కు 15:34)

5. ఎన్నిక జనుల ద్వేషంబు - నీకు - ఎండ యైునందున - దప్పి
గొన్నావా = ఉన్న యెండకును బాధకును - జిహ్వ - కూట లేనందున
- దాహమన్నావా (యోహాను 19:28)

6. పాపుల రక్షణ కొరకు - చేయ - వలసిన పనులెల్ల - ముగియించినావా
= పగలు పగవారి - తుదకు - అంతము కాగా సమాప్త మన్నావా
(యోహాను 19:30)

7. కనుక నీ యాత్మన్మరణమున - నీదు - జనకుని చేతుల -
కప్పగించితివా = జనులందరును యీ పద్ధతినే - ను -
అనుసరించునట్లు - అట్లు చేసితివా (లూకా 23:46)

247. Entha Goppa Bobba Puttenu

ఎంత గొప్ప బొబ్బ పుట్టెను - దానితో రక్షణ యంతయును సమాప్త

మాయెను = ఎంత గొప్ప బొబ్బ పుట్టెను - యేసునకు 

గల్వరి మెట్టను సంతసముతో సిల్వ గొట్టగ - 

సూర్యుండంధకార మాయెను

గలిబిలి గలిగె నొకప్పుడు - శిన్యారు బాబెలు కట్టడమును కట్టు

నప్పుడు = పలుకు భాషయు - నొక్కటైనను - పలువిధములగు

భాషలాయెను - నలు దెసలకును - జనులు పోయిరి కలువరి

కలుసుకొనిరి

పావనుండగు ప్రభువు మన కొరకై - యా సిలువ మీద చావు 

నొందెడు = సమయమందున - దేవుడ నా దేవుడ - నన్నేల 

చెయి విడిచితివి యని యా - రావముగ మొరబెట్టెను 

యె - హోవయను దన తండ్రితోన

అందు దిమిరము క్రమ్ము గడియయ్యె - నా నీతి సూర్యుని నంత

చుట్టెను బంధకంబులు - నింద వాయువులెన్నో వీచెను కందు 

యేసుని యావరించెను - పందెముగ నొక కాటు వేసెను - 

పాత సర్పము ప్రభువు యేసును

సొంతమాయె నటంచు బలుకుచు - ఆ రక్షకుడు తన - స్వంత

విలువగు ప్రాణమును వీడెన్‌ - ఇంతలో నొక భటుడు 

తనదగు నీటెతో ప్రభు ప్రక్కబొడువగ - చెంత చేరెడి

పాపులను రక్షించు రక్తపు ధార గారను

246. Aha Mahatmaha Sarnya

ఆహా మహాత్మ హా శరణ్య – హా విమోచకా
ద్రోహ రహిత చంపె నిను నా – దోషమే కదా         ||ఆహా||

వీరలను క్షమించు తండ్రి – నేరమేమియున్
కోరిటితుల నిన్ను చంపు – కౄర జనులకై         ||ఆహా||

నీవు నాతో పరదైసున – నేడే యుందువు
పావనుండ ఇట్లు పలికి – పాపి గాచితి           ||ఆహా||

అమ్మా నీ సుతుడటంచు మరి-యమ్మతో పలికి
క్రమ్మర నీ జనని యంచు – కర్త నుడితివి         ||ఆహా||

నా దేవ దేవ యేమి విడ-నాడితి వనుచు
శ్రీ దేవ సుత పలికితివి శ్రమ – చెప్ప శక్యమా     ||ఆహా||

దప్పిగొనుచున్నానటంచు – చెప్పితివి కదా
యిప్పగిదిని బాధ నొంద – నేమి నీకు హా         ||ఆహా||

శ్రమ ప్రమాద-ములను గొప్ప – శబ్ద మెత్తి హా
సమాప్తమైనదంచు తెలిపి – సమసితివి కదా   ||ఆహా||

అప్పగింతు తండ్రి నీకు – నాత్మ నంచును
గొప్ప యార్భాటంబు చేసి – కూలిపోతివా          ||ఆహా||

245. Amulya Rakthamu dwara Rakshana pondina janulara

అమూల్య రక్తము ద్వారా - రక్షణ పొందిన జనులారా

సర్వశక్తుని ప్రజలారా - పరిశుద్ధులారా పాడెదము

ఘనతా మహిమ స్తుతులను - పరిశుద్ధులారా పాడెదము

మన యవ్వన జీవితముల్‌ - శరీరాశకు లోబరచి

చెడు మాటలను బలుకుచు - శాంతిలేక యుంటిమి

చెడుమార్గమున పోతిమి - దాని యంతము మరణము

నరక శిక్షకు లోబడుచు - పాపపు ధనము పొందితిమి

నిత్య సత్య దేవుని - నామమున మొరలిడక

స్వంత నీతి తోడనే - దేవుని రాజ్యము కోరితిమి

కనికరము గల దేవుడు - మానవ రూపము దాల్చెను

ప్రాణము సిలువను బలిచేసి - మనల విమోచించెను

తన రక్త ధారలలో - మన పాపములను కడిగి

మన కన్నులను తెరచి - మనల నింపెను జ్ఞానముతో

పాపులమైన మనమీద - తన యాశ్చర్య ఘనప్రేమ

కుమ్మరించెను మన ప్రభువు - కృతజ్ఞత చెల్లింతుము

మన రక్షకుని స్తుతించెదము మనలను జేసెను ధన్యులుగా

మన దేవుని కర్పించెదము - ఆత్మ జీవ శరీరములన్‌

244. Adigadigo Alladigo Kalvari Mettaku Daradigo

అదిగదిగో అల్లదిగో
కల్వరి మెట్టకు దారదిగో
ఆ ప్రభువును వేసిన సిలువదిగో     ||అదిగదిగో||

గెత్సేమను ఒక తోటదిగో
ఆ తోటలో ప్రార్ధన స్థలమదిగో (2)
అచటనే యుండి ప్రార్ధించుడని (2)
పలికిన క్రీస్తు మాటదిగో (2)       ||అదిగదిగో||

శిష్యులలో ఇస్కరియోతు
యూదాయను ఒక ఘాతకుడు (2)
ప్రభువును యూదులకప్పగింప (2)
పెట్టిన దొంగ ముద్దదిగో (2)       ||అదిగదిగో||

లేఖనము నెరవేరుటకై
ఈ లోకపు పాపము పోవుటకై (2)
పావనుడేసుని రక్తమును గల (2)
ముప్పది రూకల మూటదిగో (2)       ||అదిగదిగో||

చలి కాచుకొను గుంపదిగో
ఆ పేతురు బొంకిన స్థలమదిగో (2)
మూడవసారి బొంకిన వెంటనే (2)
కొక్కొరొకోయను కూతదిగో (2)       ||అదిగదిగో||

యూదుల రాజువు నీవేనా
మోదముతో నీవన్నట్లే (2)
నీలో దోషము కనుగొనలేక (2)
చేతులు కడిగిన పిలాతుడాడుగో (2)       ||అదిగదిగో||

గొల్గొతా స్థల అద్దరిని
ఆ ఇద్దరు దొంగల మధ్యమున (2)
సాక్షాత్తు యెహోవా తనయుని (2)
సిలువను వేసిరి చూడదిగో (2)       ||అదిగదిగో||

గొల్లున ఏడ్చిన తల్లదిగో
ఆ తల్లికి చెప్పిన మాటదిగో (2)
యూదుల రాజా దిగి రమ్మనుచు (2)
హేళన చేసిన మూకదిగో (2)       ||అదిగదిగో||

దాహము గొనుచున్నాననుచు
ప్రాణము విడిచెను పావనుడు (2)
పరిశుద్ధుడు మన రక్షకుడేసు (2)
మన మది యేమో గమనించు (2)       ||అదిగదిగో||

243. Vandanambonarthumo Prabho Prabho

వందనం బొనర్తుమో ప్రభో ప్రభో
వందనం బోనర్తుమో ప్రభో ప్రభో
వందనంబు తండ్రి తనయు శుద్ధాత్ముడ
వందనంబు లందుకో ప్రభో

ఇన్నినాళ్లు ధరను మమ్ము బ్రోచియు
గన్నతండ్రి మించి యెపుడు గాచియు
ఎన్నలేని దీవెనలిడు నన్న యేసువా
యన్నిరెట్లు స్తోత్రములివిగో

ప్రాత వత్సరంపు బాప మంతయు
భీతిని మన్నించి మమ్ము గావుము
నూత నాబ్దమునను నీదు నీతి నొసగు మా
దాత క్రీస్తు నాధ రక్షకా

దేవ మాదు కాలుసేతు లెల్లను
సేపకాళి తనువు దినములన్నియు
నీ వొసంగు వెండి పసిడి జ్ఞానమంత నీ
సేవకై యంగీకరించుమా

కోత కొరకు దాసజనము నంపుము
ఈ ధరి మా లోటుపాట్లు దీర్చుము
పాతకంబులెల్ల మాపి భీతి బాపుము
ఖ్యాతి నొందు నీతి సూర్యుడ

మా సభలను పెద్దజేసి పంచుము  
నీ సువార్త జెప్పశక్తి నీయుము
మోసపుచ్చు నంధకార మంతద్రోయుము
యేసుకృపన్‌ గుమ్మరించుము

242. Krotha Yedu Modalubettenu

క్రొత్తయేడు మొదలుబెట్టెను - మన బ్రతుకునందు
క్రొత్త మనసుతోడ మీరు - క్రొత్త యేట ప్రభునిసేవ - దత్తర
పకుండజేయు - టుత్తమోత్తంబుడ

1. పొందియున్న మేలులన్నియు బింకంబుమీర - డెందమందు
స్మరణజేయుడి - యిందు మీరు మొదలుపెట్టు పందెమందు
బారవలయు - నందము - గను రవినిబోలి - నలయకుండ
సొలయకుండ

2. మేలుసేయ - దవొనర్పగా - మీరెరుగునట్లు - కాలమంత నిరుడు
గచెగా - ప్రాలుమాలి యుండకుండ - జాలమేలు సేయవలయు
జాల జనముల కిమ్మాను - యేలు నామ ఘనత కొరకు

3. బలములేని వారమయ్యును - బలమొందవచ్చు గలిమి మీర
గర్త వాక్కున - నలయకుండ నడుగుచుండ నలగకుండ మోదమొంది
ఫలమొసంగు సర్వవిధుల - నెలమి మీ రోనర్చుచుండ

4. ఇద్దిరిత్రి నుండనప్పుడే - ఈశ్వరుని జనులు - వృద్ధి పొంద
డవలయును - బుద్ధి నీతి శుద్ధులందు - వృద్ధి నొంద శ్రద్ధ
జేయు - శుద్ధులైన వారిలో ప్రసిద్ధులగుచు వెలుగవచ్చు

5. పాప పంకమింనప్పుడు ప్రభు క్రీస్తు యేసు ప్రాపుజేరి
మీరు వేగా - నేపు మీరదనదు కరుణ - బాపమంత గిగి
వేసి - పాపరోగ చిహ్నలన్ని బాపివేసి శుద్ధిజేయు

Wednesday 24 August 2016

241. Sudhamadhura Kiranala Arunodayam

సుధామధుర కిరణాల అరుణోదయం
కరుణామయుని శరణమరుణోదయం
తెరమరుగు హృదయాలు వెలుగైనవి
మరణాల చెరసాల మరుగైనది

1. దివిరాజుగా భువికి దిగినాడని
రవిరాజుగా ఇలలో మిగిలాడని
నవలోక గగనాలు తెరిచాడని
పరలోక భువనాలు పిలిచాడని
తీరని జీవన జ్యోతిగ వెలిగే తారొకొటొచ్చింది
పాడె పాటలు పశువుల శాలను ఊయల చేసింది
జన్మమే ఒక మర్మము బంధమే అనుబంధము

2. లోకాలలో పాప శోకాలలో
ఏకాకిలా బ్రతుకు అవివేకులు
క్షమ హృదయ సహనాలు సమపాలుగా
ప్రేమానురాగాలు స్థిర ఆస్థిగ
నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడాయేసే
నిత్యసుఖాల జీవజలాల పెన్నిధి ప్రభువే
నిను కావగా నిరుపేదగా జన్మించెగా ఇల పండుగా

240. Sri Yesundu Janminche Reyilo

శ్రీ యేసుండు జన్మించే రేయిలో
నేడు పాయక బెత్లెహేము ఊరిలో

1. కన్నియ మరియమ్మ గర్భమందున
ఇమ్మానుయేలనెడి నామమందున

2. సత్రమందున పశువుల శాలయందున
దేవపుత్రుండు మనుజుండాయెనందున

3. వట్టి పొత్తిగుడ్డలతో చుట్టబడి
పశుల తొట్టిలో పరుండ బెట్టబడి

4. గొల్లలెల్లరు మిగుల భీతిల్లగా
దెల్పె గొప్పవార్త దూత చల్లగా

5. మన కొరకొక్క శిశువు పుట్టెను
ధరను మన దోషముల బోగొట్టెను

6. పరలోకపు సైన్యంబు గూడెను
మింట వర రక్షకుని గూర్చి పాడెను

7. అక్షయుండగు యేసు పుట్టెను
మనకు రక్షణంబు సిద్ధపరచెను

239. Laali Laali Laalamma Laali (Christmas Song)

లాలి లాలి-లాలమ్మ లాలి - లాలి- లాలి
శ్రీమరియమ్మ పుత్ర నీకే లాలి

బెత్లేహేము పుర వాస్తవ్యలాలి భూలోక
వాస్తవ్యులు చేయు స్తుతులివిగో లాలి

పశుల తొట్టె - నీకు పాన్పాయెను లాలి
ఇపుడు పాపులమైన - మా
హృదయములలో పవళించుము

పొత్తి వస్త్రములే నీకు-పొదుపాయెను లాలి
మాకు మహిమ - వస్త్రము లియ్యను
నీవు మహిలో పుట్టితివా

పశువుల పాకే - నీకు వసతి గృహమాయె
మాకు మహిమ - సౌధము లియ్యను
నీవు మనుష్యుడవైతివా

తండ్రి కుమార - పరిశుద్ధాత్మలకే స్తోత్రం  
ఈ నరలోకమునకు - వేం చేసిన
శ్రీ బాలునకే సోత్రం

238. Yesuraju Yeseraju Yesuraju (Christamas Song)

యేసురాజు యేసేరాజు యేసురాజు
ఈసా ప్రజాపతి క్రీస్తేరాజు

రాకరాక వచ్చినాడు యేసురాజు
రాకరాక వచ్చినాడు క్రీస్తురాజు

లేకలేక కల్గినాడు యేసురాజు
లోకమునకు కల్గినాడు క్రీస్తేరాజు

గొల్లలకు కాన్పించె యేసురాజు
ఎల్లరకు కాన్పించె క్రీస్తేరాజు

జ్ఞానులకు కాన్పించె యేసురాజు
ఆ! జ్ఞానులకు కాన్పించె క్రీస్తురాజు

గగనమందు ఘనతనొందె యేసురాజు
జగతియందు ఘనత నొందె క్రీస్తురాజు

గౌతముని ప్రవచనము యేసేరాజు
భూతలమున గురువు రాజు క్రీస్తేరాజు

మొదట యహోదీయులకు యేసేరాజు
పిదప మనందరకు క్రీస్తేరాజు

హల్లెలూయ - హల్లెలూయ యేసేరాజు
హల్లెలూయ హల్లెలూయ క్రీస్తేరాజు

237. Yesu Baluda Yesu Baluda (Christmas Song)

యేసు బాలుడ - యేసు బాలుడ
ఎంతయు వందనం - ఓ భాసుర
దేవకుమార - భక్తి వందనం
ఓ భాసుర దేవకుమార - భక్తి వందనం

పసుల తొట్టెలోనే యప్పుడు
పండినావు ఇప్పుడు - వసుధ భక్తు
లందరిలోను - వాసము జేతువు

యూదులలోనే యావేళ - ఉద్భవించితివి
యిప్పుడు = యూదాది
సకల జనులలో - ఉద్భవింతువు

236. Yesu Janminchen Ilalo

యేసు జన్మించెన్ ఇలలో- యేసు జన్మించెన్
పాపుల కొరకును శుద్ధుల కొరకును = యేసు
జన్మించెన్ - ఈ సంతసమగు వర్తమానము
ఎల్లజనుల వీనులమ్రోగు గాక విభునకు స్తోత్రము

లోకము కొరకునును నాకై నీకై - ఆ కాలమునకై
ఈ కాలమునకై లోక రక్షకుడగు యేసుడు బుట్టెను
ఆకైసరౌగుస్తు అరయలేదు ప్రభున్ = ఇది
ఆశ్చర్యము - ఎంతో విచారము ఏల నతు
ప్రభు - నెరుగక పోయెనో

భూజనాంగములకై నాకై నీకై - రాజులకై హే - రోదు
రాజు కొరకై - రాజగు యేసుడు రంజిల్లు
బుట్టెను - రాజగు హేరోదు ప్రభువు
నరయలేదు = ఇది ఆశ్చర్యము - ఎంతో
విచారము - యేల నతు ప్రభు నెరుగక పోయెనో

సర్వలోకమునకై నాకై నీకై - సర్వ వేదజ్ఞులౌ
శాస్త్రుల కొరకై ఉర్విని - యేసుడు - ఉద్భవించెను
గర్వపు శాస్త్రులు ప్రభువు నరయలేదు = ఇది
ఆశ్చర్యము - ఎంతో విచారము - యేల వారు
ప్రభు - నెరుగక పోయిరో

నీవనుకొను ప్రతివానికై నాకై నీకై - దేవార్చకులకై
శాస్త్రుల కొరకై - దేవ నందనుడు భువిలో - బుట్టెను
ఈ వార్త చూసి వారు ప్రభుని పూజింప లేదు
ఇది ఆశ్చర్యము - ఎంతో విచారము
యేల వారు ప్రభు - నెరుగక పోయిరో

ఆ ప్రాంతపు వారికి జ్ఞానులకు - ఈ ప్రభు జన్మ
సు - వార్త విన బడియె - భూ ప్రజలీ వార్త
గ్రహియింప లేదాయె - ఆ ప్రజలకు చూచు
నాశయె లేదాయె = ఇది ఆశ్చర్యము - ఎంతో
విచారము - ఎందులకీ వార్త - యెరుగక పోయిరో

సకల మతస్థుల కొరకై నాకై - సుఖముగా జీవించ
నీ కొరకై ప్రభు - సుఖమును త్యజియించి - సుతుడై
పుట్టెను - సకల మతస్థులు - స్వామి నెరుగలేదు
ఇది ఆశ్చర్యము - ఎంతో విచారము -యేల
వారు ప్రభు - నెరుగక పోయిరో

అన్ని పల్లెలకై పట్టణములకై - కన్న బిడ్డలమగు
నాకై నీకై - చిన్నకుమారుడై - శ్రీ యేసు బుట్టెను
అన్ని చోట్లకిపుడు - వార్త తెలియు చుండెన్ = ఇది
ఆశ్చర్యము - ఎంతో సంతోషము - ఇట్లు వ్యాపింప
జేయు - దేవునికి స్తోత్రము

235. Ma Korakai ee Buviyandu

మా కొరకై ఈ భువియందు జన్మించినావు ఓ క్రీస్తు
బెత్లెహేములో పశులపాకలో మరియ ఒడిలో ఓ తనయుడ

ఏ మంచి మాలో లేకున్నవేళ దివినుండి వచ్చితివి
చీకటిలో ఉన్న మమ్మును చూసి నీ వెలుగును ఇచ్చితివి
ఎంత జాలిని చూపించినావు నీకే వందనము
హ్యాపి హ్యాపి క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్
వి విష్యు ఏ మెర్రి క్రిస్మస్

మా శిక్షను భరియించుటకై ఈ భువిలో జన్మించినావు
ఏమిచ్చినా నీ ఋణమును నేను తీర్చలేనయ్యా
ఎంత ప్రేమను చూపించినావు నీకే వందనము
హ్యాపి హ్యాపి క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్
వి విష్యు ఏ మెర్రి క్రిస్మస్

234. Parimala Sumamulu Pusenu (Christmas Song)

పరిమళ సుమములు పూసెను
ప్రభుదయ ధర విరబూసెను

అరుణోదయముగ మారెను రాత్రి
కరుణా వరములు కురిసెను
ధాత్రి పరమ రహాస్యము ప్రేమతో
ప్రసరించెను ప్రభు జన్మతో

దరిసెన మాయెను వరదును నీతి
విరమణమాయెను నరకపు భీతి
విరిసె క్షమాపణ హాయిగా
మరియ కిశోరుని జన్మగా

మెరిసెను మనమున వరుని సుహాసం
పరిచయమాయెను పరమ
నివాసం మురిసెను హృదయము కొల్లగా
అరుదెంచగ ప్రభు చల్లగా

233. Parama Pavana Deva Nara Janavana (Christmas Song)

పరమపావన దేవ నరజనావన
నిరత జీవన అద్భుత నిత్య రక్షణ

అవతరించె నవ వినూత్న నామ రూపున
అవనిదోష మనసుతో నవ విమోచన
భువన తేజమా ఘన భావ రాజ్యమా
భజియింతుము నిజభక్తిని నీతిసూర్యమా

నీతి న్యాయముల వెలుంగు నిత్యదేవుడు
బేతలేము పురిని బుట్టె పేద గృహమున
ఆది వాక్యమా ఆద్యంత రహితమా
ముదమొప్ప మది నమ్మితి మాన్య చరితమా

సుగుణ శీలురుల్లమందు సంతసించరే
శుభప్రదుండు స్వామి యేసు చెంత కరుగరే
సుగుణ బృందమా ఆశ్రిత జనాంగమా
సుగుణాత్ముని శుభకాంతుని శ్రేష్ఠ మిత్రునిన్

232. Pankthiloki Randi Krismasu Pankthiloki Randi (Christmas Song)

పంక్తిలోకి రండి - క్రిస్మసు పంక్తిలోకి రండి
క్రిస్మసు పంక్తిలోకి రండి

ఎరుకపరుపలెండి - క్రిస్మసు - నెరుకపరుపలెండి - క్రిస్మసు నెరుక పరుప లెండి = వెరువకుడి శుభవార్త ఇదియం దరకానంద - కరమైనది మీ కొరకై రక్షకుండు - బుట్టెనని ఎరిగించిన గబ్రి-యేలు దూత

మహిమ పరుపరండి - దేవుని - మహిమ పరుపరండి దేవుని - మహిమ పరుపరండి = మహికిన్ దేవకు - మారుడు వచ్చిన మహిమ కార్య స - న్మానార్ధంబై మహిమ సంభవ - మగు దేవునికని మహిమగ పలికిన - మహిమ దూతల

దేవప్రియులగుడి - క్రిస్మస్ - దేవప్రియులగుడి - క్రిస్మస్ దేవ ప్రియులగుడి = దేవుని కిష్టుల∫ వారలకు ఈ వసుధను లభి - యించును శాంతి ఈ విధముగ వచి-యించిన బుధజన సేవ కాళియగు – దేవదూతల

మనసున డండి - బాలుని - మనసున డండి - బాలుని మనసున డండి = జననవార్తను - వినిన వెంటనే మనసున భీతి - యణగినవారై మనసానందం - బును గలవారై చని శిశువును చూచిన గొల్లల

చేకొనుడి వార్త - భద్రము - చేసికొనుడి వార్త - భద్రము చేసికొనుడి వార్త = ఆ కాపరుల - యన్ని మాటలు స్వీకరించి మది - చింతన చేయుచు శ్రీకర జన్మవి - శేషంబులు హృది చేకొని భద్రము - చేసిన యామె

వింతగా చూడండి - శిశువును - వింతగ చూడండి - శిశువును వింతగ చూడండి = అంత దేవుడు నరుడై వచ్చిన - వింత శిశువును - చుచుమదిని - సంతస మొందుచు - నిశ్శబ్దముగ చెంతను గుర్చుండిన – యేసేపు

ఆరాధించండి - క్రీస్తును - ఆరాధించండి - క్రీస్తును ఆరాధించండి = రారాజగుని -శ్రాయేల్రాజౌ ఈ రాజున్న - యింకిచుక్క దారి పగా - జేరి మ్రొక్కుచు ఆరాధించిన - తూరుపు జ్ఞానుల

మనకని నమ్మండి - క్రిస్మసు - మనకని నమ్మండి - క్రిస్మసు మనకని నమ్మండి = మనకై క్రీస్తు - మహిలో బుట్టెను గనుక కృతజ్ఞత గనపరు చుటకై - మనసున బాహ్యమున - క్రిస్మసు పనులు పూనుకొను - వారి సమాజ

231. Nedu Devudu Ninnu Chudavachinadu (Christmas Song)

నేడు దేవుడునిన్ను - చూడవచ్చినాడు - మేలుకో - నరుడ మేలుకో = ఇదిగో నేడు రక్షణ దెచ్చినాడు నీకోసమై - మేలుకో - పాపము చాలుకో

దైవకోపమునుండి - తప్పించు - బాలుని - ఎత్తుకో - నరుడ ఎత్తుకో = తుదకు - నీవు మోక్షముచేరి - నిత్యముండుటకై - ఎత్తుకో - బాలుని హత్తుకో

నరకంబు తప్పించు - నరుడౌ దేవపుత్రుని - పుచ్చుకో నరుడ పుచ్చుకో = మరియు - దురితాలన్ గెల్పించు పరిశుద్ధ బాలుని పుచ్చుకో - దేవుని మెచ్చుకో

హృదయమును తొట్టెలో - నేయుండుమని మొర్ర - బెట్టుకో మొర్రబెట్టుకో = మనకు - ముదమిచ్చిబ్రోచెడి - ముద్దు బాలకుని పట్టుకో - ముద్దుబెట్టుకో

230. Na Yesuraju Nakai Puttina Roju (Christmas Song)

నా యేసు రాజు నాకై పుట్టిన రోజు (2)
క్రిస్మస్ పండుగ గుండె నిండుగ (2)
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్ (2) 

పరలోకమునే విడిచెను
పాపిని నను కరుణించెను
పసి బాలునిగ పండెను
పశువుల తొట్టిలో వింతగా (2)     ||హ్యాపీ||

నమ్మిన వారికి నెమ్మది
ఇమ్ముగనిచ్చి బ్రోవఁగా
ప్రతి వారిని పిలిచెను
రక్షణ భాగ్యమునివ్వగా (2)     ||హ్యాపీ||

229. Devadutha Krismasu (Christmas Song)

దేవదూత క్రిస్మసు .... దూతసేన క్రిస్మసు
గొల్లవారి క్రిస్మసు .... తూర్పుజ్ఞాని క్రిస్మసు

చిన్నవారి క్రిస్మసు .... పెద్దవారి క్రిస్మసు
దేశమంత క్రిస్మసు .... లోకమంత క్రిస్మసు

పల్లెయందు క్రిస్మసు .... పట్నమందు క్రిస్మసు
దేశమంత క్రిస్మసు .... లోకమంత క్రిస్మసు

క్రిస్మసన్న పండుగ .... చేసికొన్న మెండుగ
మానవాత్మ నిండుగ .... చేయకున్న దండుగ

క్రీస్తు దేవదానము .... దేవావాక్య ధ్యానము
క్రీస్తు శిష్యగానము .... వీనికాత్మ స్థానము

కన్నవారి క్రిస్మసు .... విన్నవారి క్రిస్మసు
క్రైస్తవాళి క్రిస్మసు .... ఎల్లవారి క్రిస్మసు

పాపలోకమందున .... క్రీస్తు పుట్టినందున
పాపికెంతో మోక్షము .... ఈ సువార్త సాక్ష్యము

క్రీస్తే సర్వభూపతి .... నమ్మవారి సద్గతి
మేము చెప్పు సంగతి .... నమ్మకున్న దుర్గతి 

228. Deva Stothraganamul pai (Christmas Song)

దేవస్తోత్రగానముల్ పై - దివ్య స్థలములో
దేవమారుగానముల్ భూ - దేశ స్థలములో
దేవలోక పావనులును - దీన నరులును బోవజూడ
భువిదివి క్రిస్మస్

అవ్వకిచ్చినట్టి వాక్కు - అదిగో తొట్టిలో
పవ్వళించి యున్నదేవ - బాల యేసులో
ఇవ్విధముగ సఫలమాయె - ఈ దినంబున
నవ్వు మోము - నరుని కబ్బెను

షేము దేవ వందనంబు - చెప్పబడియెను
భూమి స్తుతుల నందు కొనెడి - పూజనీయుడు
భూమి పైన నరుడుగాను = బుట్టవచ్చెను
భూమి క్రిస్మస్ - భోగమొందెను

అందరి వంశంబులు నీ - యందు దీవెన
బొందునంచు నబ్రామునకు - నందెను వాక్కు
అందె క్రీస్తు – యూదులకును అన్యజనులకున్
విందు క్రిస్మస్ - విశ్వమంతటన్

షీలోహువచ్చు వరకు యూ - దాలో నిలుచుచు
నేలు రాజదండముండు నెపుడు తొలగదు
నేల మీద నిత్యశాంతి పాలన జేయ - పాలకుండౌ
బాలుడు జన్మించెన్

అక్షయమగు చుక్క యొకటి - యాకోబులో
లక్షణముగ బుట్ట - వలయును ధాత్రి పై
రక్షణార్ధులే స దాని - రీక్షించెడు నక్షత్రంబగు
రక్షకుడుదయించె

పుట్టవలయు మోషే వంటి - పూర్ణ ప్రవక్త
ఎట్టి వారలైన నెరుగ - నట్టి ధర్మముల్
దిట్టముగను స్థాపింప - దేవ పుత్రుడు - పుట్టెన్
గొప్ప - బోధకుడయెను

మరియ పుత్ర నామ - మిమ్మానుయేలగున్
నరులకు దేవుండె తోడు - నిరతము వరకున్
దరిని దేవుడుండు గాన – వెరువ మెన్నడున్
పరమ దేవుని సహ - వాసము లభించెన్

మన నిమిత్తమైన శిశువు - మహిని బుట్టెను
చనువుగ దరిజేర శిశువు -స్వామి యాయెను
తనువు రక్షణను గణింప – వెనుక దీయడు
వియన భూషణులకు - వేళ వచ్చెను

మొలకలెత్త వలె యెష్షయి - మొద్దునందున
ఫలము లేని మోడు నరుల - వంశవృక్షము
విలువ గలుగు నిత్యజీవ – ఫలవమె లిడుటకై
కళగల జన్మార్ధ - కరుడు వచ్చెను

ఖలలు చీకటిన్ నడుచుచు - వెలుగు చూచిరి
పలు విధంబులైన యట్టి - పాప చీకటుల్
తొలగజేసి శుద్ధ కాంతి - కలుగ చేయను
వెలుగుగా దేవుడు వెలసె - ధాత్రిలో

అల్పమైన బెత్లెహేము - నందున క్రీస్తు
నిల్పవలెను తనదు జన్మ - నిజ చరిత్రను
అల్పులందు సైతమల్ప - మైన యూళ్ళలో
సల్ప రక్ష - స్థాపకుడై వచ్చె

ఆడి తప్పనట్టి దేవ - అనంత స్తోత్రముల్
నాడు పల్కు వాగ్ధా -నముల నన్నిన్
నేు నెరవేర్చినావు - నీ సుతునంపి – కీడుల్
బాపు - క్రిస్మసు గల్గె

నీ నిజ వాగ్ధత్తములను - నిత్యము నమ్మి
వాని నెరవేర్పులు విని - వట్టివి యనక
మానసమున ననుభవించు – మనసునీయుమని
దానామూల్య - జ్ఞాన మొసగుమీ

గగన మందు క్రిస్మసుండు - గాన కీర్తుల
జగతి యందు క్రిస్మసుండు - స్థవము గల్గుత
యుగయుగముల వరకు త్త్రైకు -డొందు ప్రణుతులు
సొగసుగ బరగెడు - చోద్య గీతముల్

227. Devalokamu nundi uyyalo

దేవలోకము నుండి ఉయ్యాలో
దేవదూతలు వచ్చి రుయ్యాలో

1. దేవలోకంబెల్ల .... తేజరిల్లిపోయె

2. గగన మార్గంబెల్ల .... గణగణ మ్రోగెను

3. లోకము పరలోకము .... యేకమై పోయెను

4. పరలోక దేవుండు .... ధరణిపై బుట్టెను

5. మహిమ బాలుండిగో .... మరియ్మలోన

6. సృష్టికర్త యడిగో .... శిశువుగా నున్నాడు

7. పశువుల తొట్టదిగో .... పసి పాలకుండిగో

8. బాలరాజునకు .... పాటలు పాడండి

9. బాల రక్షకునికి .... స్తోత్రములు చేయండి

10. పరలోకమంతట .... పరమ సంతోషమే

11. నా తండ్రి నా కోసం .... నరుడుగా పుట్టెను

12. ముద్దు పెట్టుకొనుడి .... ముచ్చట తీరంగ

13. మురియుచు వేయండి .... ముత్యాల హారములు

14. గొల్ల బోయలొచ్చిరి .... గొప్పగ మురిసిరి

15. తూర్పు జ్ఞానులొచ్చిరి .... దోసిలొగ్గి మ్రొక్కిరి

16. దూతలందరు కూడిరి .... గీతములు పాడిరి

17. దేవస్థానమందు .... దేవునికి సత్కీర్తి

18. యేసు బాలుండిగో .... ఎంత రమణీయుండు

19. క్రీస్తు బాలుండిగో .... క్రిస్మసు పండుగ

20. యేసుక్రీస్తు ప్రభువు .... ఏక రక్షణకర్త

21. అర్ధరాత్రి వేళ .... అంతయు సంభ్రమే

22. అర్ధరాత్రి వేళ .... అంతయు సందే

23. మధ్యరాత్రి వేళ .... మేలైన పాటలు

24. మేల్కొని పాడండి .... మంగళ హారతులు

25. చుక్క ఇంిపైన .... చక్కగా నిల్చెను

26. తండ్రికి స్తోత్రముల్ .... తనయునకు స్తోత్రములు

226. Devaloka Stothraganam Devadi Devuniki

దేవలోక స్తోత్రగానమ్ - దేవాది దేవునికి నిత్యదానమ్ = దేవలోకస్తోత్ర
గానమ్-దీనులకు సుజ్ఞానమ్ - గావించు వర్తమానమ్ – క్రైస్తవాళి
కాలమానమ్ - క్రిస్మస్ జాయ్ జాయ్

భూమికిన్ శాంతి దానమ్ - స్తోత్రంబు - పూర్తి చేయగల విధానమ్
భూమికిన్ శాంతి దానమ్ - బొందు దేవేష్ట జనమ్ – క్షేమము
సమాధానమ్ - క్రీస్తు శిష్య కాలమానమ్ - క్రిస్మస్ జాయ్ జాయ్

సర్వలోక రక్షణార్ధమ్ - ఈ వార్త - చాటించుట - ప్రధానమ్
సర్వలోక రక్షణార్ధమ్ - చాటించుట ప్రధానమ్ - సర్వదేవ సన్నిధానమ్
- సర్వలోక కాలమానమ్ - క్రిస్మస్ జాయ్ జాయ్

దేవ లోక సంస్థానమ్ - మహోన్నత - దేవుని మహిమస్థానమ్
దేవలోక సంస్థానమ్ - దేవుని మహిమస్థానమ్ - పావనకీర్తి ప్రధానమ్
భక్త సంఘ కాలమానమ్ - క్రిస్మస్ జాయ్ జాయ్

జనక పుత్రాత్మ ధ్యానం - నరాళి జగతి చేయు తీర్మానం జనక
పుత్రాత్మ ధ్యానం - జగతి చేయు తీర్మానం - నెనరు దెచ్చు సంధానం
నీనా కాలమానం - క్రిస్మస్ జయ్ జయ్

Tuesday 23 August 2016

225. Deva Deva Deva Divinunna Deva

దేవ దేవ దేవ-దివినున్న దేవా
పావన స్తోత్రముల్ పరలోక దేవా దేవ

అన్ని లోకములకు – అవతలనున్న
ఉన్నత లోకాన - నన్ను తులు గొన్న దేవ

మహిమ లోకంబున - మహిమ పూర్ణముగ
మహనీయముగ నుండు - మనకుండగను దేవ

నీ కిష్టులైనట్టి - లోకవాసులకు
రాక మానదు శాంతి – రంజిల్లు వరకు దేవ

ధరణి మీదను - సమాధానంబు కలుగు
నరులకు నీ దర్శనం - బిచట కలుగు రెండవ రాక

వధువు సంఘముకు - బాలుండు
పృథ్విని సువార్తకు – పెరుగుట పట్టు

ప్రసవ వేదన పొంది - వధువు సభ అరసె
అసలైన మగబిడ్డ - అదునుకు వెలసె

578. Nenu Na Illu Na Intivarunu

నేను నా ఇల్లు నా ఇంటి వారందరు మానక స్తుతించెదము (2) నీ కనుపాప వలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం (2) ఎబినేజరే ఎబినేజరే – ఇంత క...