Friday, 9 March 2018

400. Na Prananiki Pranam Na Jeevaniki Jeevam

నా ప్రాణానికి ప్రాణం - నా జీవానికి జీవం
నా హృదయానికి హృదయం నీవే నీవే
నా పాదాలకు దీపం నా నావకు తీరం
నా పయనానికి గమ్యం నీవే నీవే
నా కొండ నీవే నా కోట నీవే
నాకన్నీ నీవేలే యేసయ్యా

ఒంటరి బ్రతుకున జంటగ నిలిచే తోడు నీవే
చీకటి బ్రతుకున వెలుగును నింపే జ్యోతివి నీవే
ఇమ్మానుయేలు నీవే - మహిమాన్వితుడవు నీవే ||2||
నా కన్నీ నీవేలే యేసయ్యా

కృంగిన వేళలో ఆదరణిచ్చే స్వస్థతా నీవే
వేదన రోదన శోధనలోన బలము నీవే
యెహోవా రాఫా యెహోవా యీరే ||2||
నా కన్నీ నీవేలే యేసయ్యా

కరుణతో కలుషము మాపే కర్తవు నీవే
పాప క్షమాపణ శాప విమోచన ముక్తివి నీవే
నా రక్షణ నీవెలే నిరీక్షణ నీవెలే ||2||
నా కన్నీ నీవేలే యేసయ్యా

15 comments:

586. Kantipapala Kachinavayya

కంటిపాపలా కాచినావయ్యా – చంటిపాపను మోసినట్టు మోసినావయ్యా చేతి నీడలో దాచినావయ్యా – తోడుగా మా ముందరే నడచినావయ్యా పోషించినావయ్యా.. బలపరచినా...