Tuesday 20 June 2017

277. Panduga Penthekostu Panduga Viswasulara

పండుగ పెంతెకోస్తు పండుగ - విశ్వాసులారా - పండుగ ఈ వేళ గొప్ప పండుగ = పండుగ పరిశుద్ధాత్మ భక్త జనముల హృదయములలో - నిండుగానే కుమ్మరింపై - నిలిచి వాసము చేసినట్టి

నూట యిరువది మంది యొక్క - చోట నొక్కరై యుండి కూటమున ప్రార్ధించు చుండ - కుమ్మరింపు గలిగినట్టి

నేడు నందరు నేకముగనే - కూడుకొని యది తలంచుకొని వేడుకొన్న యెడల ఆత్మ - విరివిగానే వచ్చునట్టి

ఆపదలపై ఆపదలు ని - న్నావరించుకొనును గాని ఆప శక్యము గాని యుత్సా - హంబు మది వ్యాపించునట్టి

ఆత్మ కుమ్మరింపె పరిశు - ద్ధాత్మ బాప్తిస్మంబు పరిశు - ద్ధాత్మాభిషేకంబు ఆత్మ నొందుట ఆత్మ పూర్ణత

జీవ బోధలు చేయ గొప్ప - జివ గలుంగును వాక్య మందలి భావములు ఒక ప్రక్క నుండి - ప్రజల కర్ధమగుచు నుండు

కుమ్మరింపు కలుగగానే - కుమ్మరములు - కూలిపోవును ముమ్మరము గా చిక్కులెన్నో - ముంచుకొని పైబడెడు గొప్ప

జనములన్నియు ఆత్మ స్నానము - దినక్రమమున నొందుగాక జనక కుమారాత్మలకును - ఘనత మహిమ మహిమ మహిమ మహిమ

276. Nenu Nijamaithe Na Athma Nijamouna

నేను నిజమైతే నా ఆత్మ నిజమౌనా
నా ఆత్మ నిజమైతే పరమాత్మ నిజమౌనా
నేను నిజమైతే నా ఆత్మ నిజమౌనా

కట్టె వంటిది ఈ దేహం నిప్పు వంటిది ఆత్మ
కట్టెకు వంకరలుండును కాని నిప్పుకు వంకరలుండునా
కట్టె వంటివాడు దాసుడైతే నిప్పు వంటివాడు నా యేసు

ఏటి వంటిది ఈ దేహం నీటి వంటిది ఆత్మ
ఏటికి వంకరలుండును కాని నీటికి వంకరలుండునా
ఏటి వంటివాడు దాసుడైతే నీటి వంటివాడు నా యేసు

ఆవు వంటిది ఈ దేహం పాలవంటిది ఆత్మ
ఆవుకు రంగులుండును కాని పాలకు రంగులుండునా
ఆవు వంటివాడు దాసుడైతే పాల వంటివాడు పరలోకపుతండ్రి

275. Nirantharam Nithone Jivinchalane Asa

నిరంతరం నీతోనే జీవించాలనే
ఆశ నన్నిల బ్రతికించుచున్నది
నా ప్రాణేశ్వరా.. యేసయ్యా
నా సర్వస్వమా.. యేసయ్యా             II నిరంతరంII

చీకటిలో నేనున్నప్పుడు
నీ వెలుగు నాపై ఉదయించెను (2)
నీలోనే నేను వెలగాలనీ
నీ మహిమ నాలో నిలవాలనీ (2)
పరిశుద్ధాత్మ అభిషేకముతో
నన్ను నింపుచున్నావు నీ రాకడకై     II నిరంతరంII

నీ రూపము నేను కోల్పోయినా
నీ రక్తముతో కడిగితివి (2)
నీతోనే నేను నడవాలనీ 
నీవలెనే నేను మారాలనీ (2)
పరిశుద్ధాత్మ వరములతో
అలంకరించుచున్నావు నీ రాకడకై     II నిరంతరంII

తొలకరి వర్షపు జల్లులలో
నీ పొలములోనే నాటితివి (2)
నీలోనే నేను చిగురించాలనీ
నీలోనే నేను పుష్పించాలనీ (2)
పరిశుద్ధాత్మ వర్షముతో
సిద్ధపరచుచున్నావు నీ రాకడకై         II నిరంతరంII

274. Daivathma Rammu Na thanuvuna vralumu

దైవాత్మ రమ్ము - నా తనువున వ్రాలుము
నా జీవమంతయు నీతోనుండ - జేరి వసింపుము

స్వంతబుద్ధితోను - యేసుప్రభుని నెరుగలేను
నే నెంతగ నాలోచించిన విభుని - నెరిగి చూడలేను

స్వంతశక్తితోను - యేసు - స్వామి జేరలేను
నే నెంతనడచిన ప్రభుని కలిసికొని – చెంతజేరలేను

పాప స్థలమునుండి - నీ సువార్త కడకు నన్ను
భువిలో పరమాత్మ నడుపుచుండుము - ఉత్తమ స్థలమునకు

పాపములో మరల - నన్ను పడకుండగ జేసి
ఆ నీ పరిశుద్ధమైన రెక్కల నీడను – కాపాడు

పరిశుద్ధునిజేసి - నీ వరములు దయచేసి
నీ పరిశుద్ధ సన్నిధి జూపుమ - పావురమా వినుమా

తెలివిని గలిగించు - నన్ను దివ్వెగ వెలిగించు
నీ కలిగిన భాగ్యములన్నిటిని నా - కంటికి జూపించు

నన్నును భక్తులను - యేనాడును కృపతోను
నిల మన్నించుము మా పాపరాశులను మాపివేయు దేవా

వందనములు నీకు - శుభ వందనములు నీకు
ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు

273. Jeeva Nadini Na hrudayamulo

జీవనదిని నా హృదయంలో ప్రవహింప చేయుమయా

ఎండిన ఎముకలన్నీమళ్ళీ జీవింప చేయుమయా
నీ శ్వాసను ఊది నీ శక్తితో లేపుమయా

శరీర వాంఛలన్నీనాలో నశియింప చేయుమయా
నీ ఆత్మ కార్యములు నాలో జరిగింప చేయుమయా

బలహీన సమయములో నీ బలము ప్రసాదించు
నీ కృప చాలునయా నే నిరతము జీవింప

ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా
నీ సాక్షిగా మలచి నీయందే జీవింపనూ

272. Abhishekama Athmabishekama nanu deevimpa

అభిషేకమా ఆత్మభిషేకమా

నను దీవింప నాపైకి దిగిరమ్మయా

నీవు నాలో ఉండ నాకు భయమే లేదు 

నేను దావీదు వలె నుందును

గొల్యాతును పడగొట్టి జయమొందెదన్‌

నీవు నాలో ఉండ నేను ఎలిషావలె 

యొర్దానును విడగొట్టెదన్‌

ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను

నీవు నాలో ఉండ నేను స్టెఫను వలె 

ఆత్మ జ్ఞానముతో మ్లాడెదన్‌

దేవదూతల రూపములో మారిపోదును

271. Abhishekam Diguthundi Agin Jwalalu

అభిషేకం దిగుతుంది - అగ్ని జ్వాలలు వీస్తున్నాయి

శక్తిగల మహాగాలి - జనములు లేవాలి

ఉజ్జీవము రావాలి - ఆత్మ మహాగాలి   

వీస్తోంది వీస్తోంది ఆత్మగాలి

వీస్తోంది అగ్ని సుడిగాలి

అగ్ని నాలుకలు దిగుచున్నాయి 

ఇక్కడ నూతన శక్తి పొంగుచున్నది

అద్భుతం జరుగుచున్నది

దెయ్యాలు పరుగెడుచున్నవి

ఏలియా శక్తి దిగుచున్నది 

ఇక్కడ ఎలీషా శక్తి పెరుగుచున్నది

రెట్టింపు శక్తియే అది

యేసుని శక్తియే

ఎర్రసముద్రమును చీల్చాడే 

ఇక్కడ జయధ్వని ఏకముగా వచ్చుచున్నది

ఆకాశం తెరువబడిందీ

వాక్యము ధ్వనిస్తున్నదీ

ఆత్మశక్తి వీస్తున్నది - ఎండిన ఎముకలు 

అన్నియు కలియుచున్నవి

ఉన్నత శక్తి ఇదే  

అద్భుతం చేయుచున్నదీ 

578. Nenu Na Illu Na Intivarunu

నేను నా ఇల్లు నా ఇంటి వారందరు మానక స్తుతించెదము (2) నీ కనుపాప వలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం (2) ఎబినేజరే ఎబినేజరే – ఇంత క...