Tuesday 20 June 2017

277. Panduga Penthekostu Panduga Viswasulara

పండుగ పెంతెకోస్తు పండుగ - విశ్వాసులారా - పండుగ ఈ వేళ గొప్ప పండుగ = పండుగ పరిశుద్ధాత్మ భక్త జనముల హృదయములలో - నిండుగానే కుమ్మరింపై - నిలిచి వాసము చేసినట్టి

నూట యిరువది మంది యొక్క - చోట నొక్కరై యుండి కూటమున ప్రార్ధించు చుండ - కుమ్మరింపు గలిగినట్టి

నేడు నందరు నేకముగనే - కూడుకొని యది తలంచుకొని వేడుకొన్న యెడల ఆత్మ - విరివిగానే వచ్చునట్టి

ఆపదలపై ఆపదలు ని - న్నావరించుకొనును గాని ఆప శక్యము గాని యుత్సా - హంబు మది వ్యాపించునట్టి

ఆత్మ కుమ్మరింపె పరిశు - ద్ధాత్మ బాప్తిస్మంబు పరిశు - ద్ధాత్మాభిషేకంబు ఆత్మ నొందుట ఆత్మ పూర్ణత

జీవ బోధలు చేయ గొప్ప - జివ గలుంగును వాక్య మందలి భావములు ఒక ప్రక్క నుండి - ప్రజల కర్ధమగుచు నుండు

కుమ్మరింపు కలుగగానే - కుమ్మరములు - కూలిపోవును ముమ్మరము గా చిక్కులెన్నో - ముంచుకొని పైబడెడు గొప్ప

జనములన్నియు ఆత్మ స్నానము - దినక్రమమున నొందుగాక జనక కుమారాత్మలకును - ఘనత మహిమ మహిమ మహిమ మహిమ

No comments:

Post a Comment

578. Nenu Na Illu Na Intivarunu

నేను నా ఇల్లు నా ఇంటి వారందరు మానక స్తుతించెదము (2) నీ కనుపాప వలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం (2) ఎబినేజరే ఎబినేజరే – ఇంత క...