దేవ యెహోవా స్తుతి పాత్రుండ
పరిశుద్ధాలయ పరమనివాసా
బలమును కీర్తియు శక్తి ప్రసిద్ధత సర్వము నీవే
సకల ప్రాణులు స్తుతి చెల్లించగ
సర్వదనిను స్తుతులొనరించగనున్న
నీదు పరాక్రమ కార్యములన్నియు నిరతము నీవే
నీదు ప్రభావ మహాత్యము లన్నియు
నిత్యము పొగడగ నిరతము స్తోత్రములే
స్వరమండల సితారలతోను బూరలధ్వనితో
తంబురలతో నాట్యము లాడుచు
నిను స్తుతియించుచు స్తోత్రము జేసెదము
తంతి వాద్య పిల్లన గ్రోవి మ్రోగెడు తాళము
గంభీర ధ్వని గల తాళములతో
ఘనుడగు దేవుని కీర్తించనురారే
పరమాకాశపు దూతల సేనలు పొగడగ మీరు
ప్రేమ మయుని స్తోత్రము చేయగ
పరమానందుని వేగ స్మరించనురారే
సూర్యచంద్ర నక్షత్రంబు గోళములారా
పర్వత మున్నగు వృక్షములారా
పశువులారా ప్రణుతించనురారే
అగ్నియు మంచును సముద్ర ద్పీపకల్పములారా
హిమమా వాయువు తుఫానులారా
మేఘములారా మహిమపరచరారే
సకల జలచర సర్వసమూహములారా
ఓ ప్రజలారా భూపతులారా
మహానీయుండగు దేవుని స్తుతిచేయన్