Monday 25 July 2016

28. Deva Yehoava Stuti Patrunda

దేవ యెహోవా స్తుతి పాత్రుండ
పరిశుద్ధాలయ పరమనివాసా

బలమును కీర్తియు శక్తి ప్రసిద్ధత సర్వము నీవే
సకల ప్రాణులు స్తుతి చెల్లించగ
సర్వదనిను స్తుతులొనరించగనున్న

నీదు పరాక్రమ కార్యములన్నియు నిరతము నీవే
నీదు ప్రభావ మహాత్యము లన్నియు
నిత్యము పొగడగ నిరతము స్తోత్రములే

స్వరమండల సితారలతోను బూరలధ్వనితో
తంబురలతో నాట్యము లాడుచు
నిను స్తుతియించుచు స్తోత్రము జేసెదము

తంతి వాద్య పిల్లన గ్రోవి మ్రోగెడు తాళము
గంభీర ధ్వని గల తాళములతో
ఘనుడగు దేవుని కీర్తించనురారే

పరమాకాశపు దూతల సేనలు పొగడగ మీరు
ప్రేమ మయుని స్తోత్రము చేయగ
పరమానందుని వేగ స్మరించనురారే

సూర్యచంద్ర నక్షత్రంబు గోళములారా
పర్వత మున్నగు వృక్షములారా
పశువులారా ప్రణుతించనురారే

అగ్నియు మంచును సముద్ర ద్పీపకల్పములారా
హిమమా వాయువు తుఫానులారా
మేఘములారా మహిమపరచరారే

సకల జలచర సర్వసమూహములారా
ఓ ప్రజలారా భూపతులారా
మహానీయుండగు దేవుని స్తుతిచేయన్

27. Jyothirmayuda Na prana priyuda

జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా
స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం
నా అతిశయము నీవే – నా ఆనందము నీవే
నా ఆరాధనా నీవే (2)                               ||జ్యోతి||

నా పరలోకపు తండ్రి – వ్యవసాయకుడా (2)
నీ తోటలోని ద్రాక్షావల్లితో
నను అంటు కట్టి స్థిరపరిచావా (2)           ||జ్యోతి||

నా పరలోకపు తండ్రి – నా మంచి కుమ్మరి (2)
నీకిష్టమైన పాత్రను చేయ
నను విసిరేయక సారెపై నుంచావా (2)     ||జ్యోతి||

నా తండ్రి కుమారా – పరిశుద్దాత్ముడా (2)
త్రియేక దేవా ఆదిసంభూతుడా
నిను నేనేమని ఆరాధించెద (2)              ||జ్యోతి||

Friday 22 July 2016

26. Juntethene Dharala Kanna Yesunamame Madhuram

జుంటి తేనె ధారల కన్నా
యేసు నామమే మధురం
యేసయ్య సన్నిధినే మరువజాలను (2)
జీవితకాలమంతా ఆనందించెదా
యేసయ్యనే ఆరాధించెదా (2)                 ||జుంటి తేనె||

యేసయ్య నామమే బహు పూజనీయము
నాపై దృష్టి నిలిపి సంత్రుష్టిగా నను ఉంచి (2)
నన్నెంతగానో దీవించి
జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే (2)  ||జుంటి తేనె||

యేసయ్య నామమే బలమైన దుర్గము
నా తోడై నిలిచి క్షేమముగా నను దాచి (2)
నన్నెంతగానో కరుణించి
పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే (2)      ||జుంటి తేనె||

యేసయ్య నామమే పరిమళ తైలము
నాలో నివసించే సువాసనగా నను మార్చి (2)
నన్నెంతగానో ప్రేమించి
విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే (2)    ||జుంటి తేనె||

25. Jivithamantha Ni Prema Ganam

జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుమో దేవా
ప్రచురింతు మేము నీ కీర్తిన్ ఆనంద గానంబుతో (2)

సర్వ సమయములలో నీ స్తుతి గానం
ఎల్లవేళలయందు నీ నామ ధ్యానం (2)
మాకదియే మేలు ఈ జీవితమున
స్తుతియింతు నా రక్షకా – (2)         ||జీవితమంతా||

సృష్టినంతటిని నీ మాట చేత
సృజియించితివిగా మా దేవ దేవా (2)
నీ ఘనమగు మహిమం వర్ణింప తరమా
స్తుతియింతు నా రక్షకా – (2)         ||జీవితమంతా||

కలుషాత్ములమైన మా కొరకు నీ
విలువైన ప్రాణంబు నర్పించితివిగా (2)
కల్వరి గిరిపై చూపిన ప్రేమన్
స్తుతియింతు నా రక్షకా – (2)         ||జీవితమంతా||

24. Jayam Jayam Jayam Jayam Jayasiludu Na Rarajuku

జయం జయం జయం జయం
జయశీలుడు నా రారాజుకు
జయం జయం జయం జయం
విజయము నిచ్చెడి యేసయ్యకు
సర్వోన్నత నీకే జయం
సర్వాంతర్యామి నీకే జయం ||2||
సర్వ కృపానిధి నీకే జయం
సర్వాధిపతివి నీకే జయం ||2||

పాపపు లోకపు పాశములు
పడద్రోసిన నా పరమ ప్రభు
పరిశుద్ధులుగా చేయుటకు
పరమును వీడిన నీకే జయం

శాపపు కాడిని లయపరచి
సాతాను శిరస్సును చితుకద్రొక్కి
ఆశీర్వాదపు పుత్రులుగా
మములను చేసిన నీకే జయం

23. Jagamulanele Sri Yesa Ma Rakshana Prakarama

జగములనేలే శ్రీ యేసా
మా రక్షణ ప్రాకారమా
మా అనుదిన జీవాహారమా (2)               ||జగములనేలే||

వేల్పులలోన నీవంటి దేవుడు
ఎవరున్నారు ప్రభూ (2)
పూజ్యులలోన పూజార్హుడవు (2)
నీవే మా ప్రభువా నీవే మా ప్రభువా (2)
అడిగిన ఇచ్ఛే దాతవు నీవే దేవా
శరణము వేడిన అభయము నొసగే దేవా (2)
అవధులు లేని నీ ప్రేమను (2)
వర్ణింప చాలనయ్యా వర్ణింప చాలనయ్యా  ||జగములనేలే||

జీవనమంతయు నీకర్పించి
పానార్పణముగా నే పోయబడుదును (2)
శ్రేష్టఫలములను ఫలియించెదను (2)
నీదు సన్నిధిలో నీదు సన్నిధిలో (2)
విరిగిన మనస్సే నీకతి ప్రియమో దేవా
నలిగిన హృదయం నీ ఆలయమో దేవా (2)
అన్ని వేళలలో మాతో ఉండి (2)
మమ్ము నడిపించు ప్రభో
మమ్ము నడిపించు ప్రభో                         ||జగములనేలే||

22. Chuchuchunna Devudavu Nive Yesayya

చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా
చూడ ముచ్చటాయెనే సుకుమార సుమములైన
నీ నేత్రాలంకృతము (2)

పశ్చాత్తాపము కలుగునే నీ దయగల చూపులతో
క్షమించబడుదురు ఎవరైనా రక్త ప్రోక్షణతో (2)
ఆప్యాయతకు నోచుకొనని
నను చేరదీసిన కృపా సాగరా (2)        ||చూచుచున్న||

అగ్ని జ్వాలామయమే నీ చూపుల వలయాలు
తప్పించుకొందురా ఎవరైనా ఎంతటి ఘనులైనా (2)
అగ్ని వంటి శోధనలను
తప్పించితివే దయా సాగరా (2)          ||చూచుచున్న||

578. Nenu Na Illu Na Intivarunu

నేను నా ఇల్లు నా ఇంటి వారందరు మానక స్తుతించెదము (2) నీ కనుపాప వలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం (2) ఎబినేజరే ఎబినేజరే – ఇంత క...