Monday 23 March 2020

551. Kalvari Giripai Siluva Baram

కల్వరి గిరిపై సిలువ భారం
భరించితివా ఓ నా ప్రభువా
నా పాపముకై నీ రక్తమును
సిలువ పైన అర్పించితివా (2)
దుష్టుండనై బల్లెము బూని
గ్రుచ్చితి తండ్రి ప్రక్కలోన (2)
కేక వేసి నీదు ప్రాణం
సిలువ పైన అర్పించితివా (2)       ||కల్వరి||
మూడు దినములు సమాధిలో
ముదము తోడ నిద్రించితివా (2)
నా రక్షణకి సజీవముతో
సమాధిన్ గెల్చి లేచిన తండ్రి (2)   ||కల్వరి||
ఆరోహణమై వాగ్ధానాత్మన్
సంఘము పైకి పంపించితివా (2)
నీ రాకడకై నిరీక్షణతో
నిందలనెల్ల భరించెదను (2)         ||కల్వరి||

550. Kalamulatho Rayagalama

కలములతో రాయగలమా
కవితలతో వర్ణించగలమా
కలలతో వివరించగాలమా
నీ మహోన్నతమైన ప్రేమా (2)
ఆరాధింతును (4)
రారాజువు నీవే
నా తండ్రివి నీవే
నిను విడువను ఎడబాయను (2)
ఆకాశములు నీ మహిమను
వివరించుచున్నవి
అంతరిక్షము నీ చేతి పనిని
వర్ణించుచున్నది (2)
దేవా నా ప్రాణము
నీ కొరకై తపియించుచున్నది (2)     ||ఆరాధింతును||
సెరాపులు కెరూబులు
నిత్యము నిను స్తుతియించుచున్నవి
మహా దూతలు ప్రధాన దూతలు
నీ నామము కీర్తించుచున్నవి (2)
దేవా నా ప్రాణము
నీ కొరకై తపియించుచున్నది (2)      ||ఆరాధింతును||

549. Kannillatho Pagiligina Gundetho

కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసిన నేస్తమా
మనసున్న మారాజేసుని మదిలో నిలుపుమా (2)
విడువడు నిన్ను ఎడబాయడు నిన్ను
కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును (2)
విడువడు నిన్ను
రాతిరంత ఏడుపొచ్చినా – కంట నీరు ఆగకుండినా
కాలమింక మారకుండునా – వెలుగు నీకు కలగకుండునా
ప్రాణమిచ్చి ప్రేమ పంచినా – పేరు పెట్టి నిన్ను పిలచినా
నీ చేయి పట్టి విడచునా – అనాథగా నిన్ను చేయునా           ||విడువడు||
అంధకారమడ్డు వచ్చినా – సంద్రమెంత ఎత్తు లేచినా
నిరాశలే పలకరించినా – క్రీస్తు ప్రేమ నిన్ను మరచునా
బాధ కలుగు దేశమందునా – బంధకాలు ఊడకుండునా
శత్రువెంతో పగతో రగిలినా – గిన్నె నిండి పొర్లకుండునా        ||విడువడు||

548. Kanuchupu Meralona

నేనున్నా నీతో అంటూ
నా చెంతకు చేరావు
యేసయ్యా.. యేసయ్యా…
కనుచూపు మేరలోన ఏ ఆశ లేని వేళ
ఎటు తోచక లోలోన నే కృంగియున్న వేళ
నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు
నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు (2)
మొదలుపెట్టిన కార్యం మధ్యలో ఆగిపోగా
బెదిరిపోయి నా హృదయం బేలగా మారిపోగా (2)
పని పూర్తి చేయగ బలము లేని వేళ (2)
నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు
నా ఆటంకాలన్నిటిని యేసూ తొలగించావు (2)
శ్రమలు తెచ్చిన దుఃఖం శాంతినే దోచుకోగా
చెదిరిపోయి ఆశల సౌధం నా గొంతు మూగబోగా (2)
స్తుతి పాట పాడగ స్వరము రాని వేళ (2)
నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు
నా నోటను నూతన గీతం యేసూ పలికించావు (2)
కపట మిత్రుల మోసం అగ్నిలా కాల్చబోగా
సడలిపోయి నా విశ్వాసం ధైర్యమే లేకపోగా (2)
అడుగేసి సాగగ అనువుకాని వేళ (2)
నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు
నా ప్రార్థనకు ఫలమిచ్చి యేసూ నడిపించావు (2)         ||కనుచూపు||

547. O Prabhuva O Phrabhuva

ఓ ప్రభువా… ఓ ప్రభువా…
నీవే నా మంచి కాపరివి (4)     ||ఓ ప్రభువా||
దారి తప్పిన నన్నును నీవు
వెదకి వచ్చి రక్షించితివి (2)
నిత్య జీవము నిచ్చిన దేవా (2)
నీవే నా మంచి కాపరివి (4)          ||ఓ ప్రభువా||
నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని
ఎల్లపుడు చేయి విడువక (2)
అంతము వరకు కాపాడు దేవా (2)
నీవే నా మంచి కాపరివి (4)          ||ఓ ప్రభువా||
ప్రధాన కాపరిగా నీవు నాకై
ప్రత్యక్షమగు ఆ ఘడియలలో (2)
నన్ను నీవు మరువని దేవా (2)
నీవే నా మంచి కాపరివి (4)          ||ఓ ప్రభువా||

546. Oka varamadigithini Yesayya

ఒక వరమడిగితిని యేసయ్యా
నీలా ఉండాలని – మండుచుండాలని
నీలా ఉండాలని – మండుచుండాలని (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)  ||ఒక ||
నాలో నేరము స్థాపించగలరా
ప్రతిధ్వని ఇచ్చెను నీ స్వరము ధరలో (2)
నన్ను పరిశుద్ధపరచి తుది శ్వాస వరకు
నీ మార్గములలో నడిపించవా (2)       ||ఒక ||
సర్వ సృష్టికి సర్వాధికారి
తల వాల్చుటకును స్థలమింత లేదా (2)
నేను లోకాశ విడచి పైనున్నవాటి
గురి కలిగి వెదకి పొందాలని (2)       ||ఒక ||
తండ్రిని విడచి పారమును వీడి
నన్ను సమీపించినావు (2)
నేను కలిగున్నదంత నీ పాదాల చెంత
అర్పించి నీ చెంత చేరాలని (2)       ||ఒక ||
దేవుని చిత్తము సంపూర్తి చేయగ
సిలువలో వ్రేళాడి శ్రమ నొందినావు (2)
నేను నీ సిలువ మోయుచు కడవరకు ఇలలో
నీ సాక్షిగా జీవించాలని (2)       ||ఒక ||

545. O Manava Nee Papam Manava

ఓ మానవా.. నీ పాపం మానవా
యేసయ్య చెంత చేరి
నీ బ్రతుకు మార్చవా (2)
పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము
పాపములోనే మరణించినచో తప్పదు నరకము (2)  ||ఓ ||
ఎంత కాలము పాపములోనే బ్రతుకుచుందువు
ఎంత కాలము శాపములోనే కొట్టబడుదువు
ఎంత కాలము వ్యసనపరుడవై తిరుగుచుందువు
ఎంత కాలము దుఃఖములోనే మునిగియుందువు
యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము
యేసయ్య తన రక్తంతో నీ పాపం కడుగును (2)  ||ఓ ||
ఎంత కాలము దేవుని విడిచి తిరుగుచుందువు
ఎంత కాలము దేవుడు లేక బ్రతుకుచుందువు
ఎంత కాలము దేవుని మాటను ఎదిరించెదవు
ఎంత కాలము దేవుని నీవు దుఃఖపరతువు
యెసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను
యెసయ్యే నిను రక్షించి పరమున చేర్చును (2) ||ఓ ||

578. Nenu Na Illu Na Intivarunu

నేను నా ఇల్లు నా ఇంటి వారందరు మానక స్తుతించెదము (2) నీ కనుపాప వలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం (2) ఎబినేజరే ఎబినేజరే – ఇంత క...