Saturday, 6 August 2016

152. Sakshayamicheda Mana Swamy Yesu Devudanchu

సాక్ష్యమిచ్చెద - మనస్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెద
సాక్ష్యమనగ గనిన వినిన సంగతులను దెల్పుటయే
సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించెననుచు

1. దిక్కు దెసయు లేని నన్ను - దేవుడెంతొ కనికరించి
మక్కువతో నాకు నెట్లు - మనశ్శాంతి నిచ్చినాడో

2. పల్లెటూళ్ల జనుల రక్షణ - భారము నాపైన గలదు
పిల్లలకు పెద్దలకు - ప్రేమతో నా స్వానుభవము

3. బోధ చేయలేను వాద - ములకుబోను నాకదేల
నాధుడేసు ప్రభుని గూర్చి - నాకు తెలిసినంత వరకు

4. పాపులకును మిత్రడంచు - ప్రాణమొసగి లేచెనంచు
పాపముల క్షమించునంచు - ప్రభుని విశ్వసించుడనుచు

 5. చోరులైన జారులైన - చారులైన నెవ్వరైన
ఘోరపాపులైన క్రీస్తు - కూర్మితో రక్షించుననుచు

6. పరమత దూషణములేల - పరిహసించి పలుకుటేల
ఇరుగు పొరుగు వారికెల్ల - యేసుక్రీస్తు దేవుడంచు

7. ఎల్లకాల మూరకుండనేల - యాత్మ శాంతిలేక
తల్లడిల్లు వారలకును తండ్రి కుమారాత్మ పేర

3 comments:

Sarvadhikariyaina Sarva Sakthimanthudu | Telugu Christian Song # 604

ఏదైనా సాధ్యమే | Telugu Christian Song ✨ ఏదైనా సాధ్యమే ✨ సర్వాధికారియైన సర్వశక్తిమంతుడు అధిక ప్రేమామయ...

About Me

My photo
I’m Gnana Ratnam Veladuti, a devoted Christian sharing devotional messages and sermons. My goal is to encourage believers to stay strong in faith.

📌 Follow my blog for daily inspiration and spiritual encouragement.