Saturday, 6 August 2016

168. Ni Jaldaru Vrukshapu Nidalalao

నీ జల్దరు వృక్షపు నీడలలో
నేనానంద భరితుడనైతిని 
బలు రక్కసి వృక్షపు గాయములు 
ప్రేమా హస్తములతో తాకు ప్రభు      ||నీ జల్దరు||

నా హృదయపు వాకిలి తీయుమని
పలు దినములు మంచులో నిలచితివి 
నీ శిరము వానకు తడిచినను 
నను రక్షించుటకు వేచితివి             ||నీ జల్దరు||

ఓ ప్రియుడా నా అతి సుందరుడా
దవళ వర్ణుడా నాకతి ప్రియుడా 
వ్యసనా క్రాంతుడుగా మార్చబడి 
నీ సొగసును నాకు నొసగితివి          ||నీ జల్దరు||

నీ పరిమళ పుష్ప సుగంధములు
నా రోత హృదయమును నింపినవి 
ద్రాక్షా రస ధారల కన్న మరి 
నీ ప్రేమే ఎంతో అతి మధురం          ||నీ జల్దరు||

ఉన్నత శిఖరములు దాటుచును
ఇదిగో అతడొచ్చుచున్నాడు 
నా హృదయపు తలుపులు తెరచుకొని 
నా ప్రియుని కొరకు కనిపెట్టెదను      
||నీ జల్దరు||

నీ విందుశాలకు నడిపించి
రాజులు యాజకులతో జేర్చితివి
జీవాహారము నాకందించి
పరమాగీతములను నేర్పితివి 
         ||నీ జల్దరు||

No comments:

Post a Comment

Sarvadhikariyaina Sarva Sakthimanthudu | Telugu Christian Song # 604

ఏదైనా సాధ్యమే | Telugu Christian Song ✨ ఏదైనా సాధ్యమే ✨ సర్వాధికారియైన సర్వశక్తిమంతుడు అధిక ప్రేమామయ...

About Me

My photo
I’m Gnana Ratnam Veladuti, a devoted Christian sharing devotional messages and sermons. My goal is to encourage believers to stay strong in faith.

📌 Follow my blog for daily inspiration and spiritual encouragement.