Saturday, 20 August 2016

211. Nivunte Naku Chalu Yesayya

నీవుంటే నాకు చాలు యేసయ్యా
నీవెంటే నేను ఉంటానేసయ్యా (2)
నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా
నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా  ||నీవుంటే||

ఎన్ని బాధలు ఉన్ననూ ఇబ్బందులైననూ
ఎన్ని శ్రమలు ఉన్ననూ నిష్టూరమైననూ ||నీ మాట||

బ్రతుకు నావ పగిలినా కడలి పాలైననూ
అలలు ముంచి వేసినా ఆశలు అణగారినా||నీ మాట||

ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా
ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా  
||నీ మాట||

నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము
నీదు కృపతో నాకేదియు కాదిల సమానము||నీ మాట||

No comments:

Post a Comment

Sarvadhikariyaina Sarva Sakthimanthudu | Telugu Christian Song # 604

ఏదైనా సాధ్యమే | Telugu Christian Song ✨ ఏదైనా సాధ్యమే ✨ సర్వాధికారియైన సర్వశక్తిమంతుడు అధిక ప్రేమామయ...

About Me

My photo
I’m Gnana Ratnam Veladuti, a devoted Christian sharing devotional messages and sermons. My goal is to encourage believers to stay strong in faith.

📌 Follow my blog for daily inspiration and spiritual encouragement.