Saturday, 20 August 2016

206. Kurchundunu Nee Sannidhilo Deva Prathidinam

కూర్చుందును నీ సన్నిధిలో – దేవా ప్రతి దినం
ధ్యానింతును నీ వాక్యమును – దేవా ప్రతి క్షణం (2)
నిరంతరం నీ నామమునే గానము చేసెదను
ప్రతి క్షణం నీ సన్నిధినే అనుభవించెదను  ||కూర్చుందును||

ప్రతి విషయం నీకర్పించెద
నీ చిత్తముకై నే వేచెద (2)
నీ స్ఫూర్తిని పొంది నే సాగెద (2)
నీ నామమునే హెచ్చించెద (2)
నా అతిశయము నీవే – నా ఆశ్రయము నీవే
నా ఆనందము నీవే – నా ఆధారము నీవే
యేసూ యేసూ యేసూ యేసూ..         ||కూర్చుందును||

ప్రతి దినము నీ ముఖ కాంతితో
నా హృదయ దీపం వెలిగించెద (2)
నీ వాక్యానుసారము జీవించెద (2)
నీ ఘన కీర్తిని వివరించెద (2)
నా దుర్గము నీవే – నా ధ్వజము నీవే
నా ధైర్యము నీవే – నా దర్శనం నీవే
యేసూ యేసూ యేసూ యేసూ..         ||కూర్చుందును|

No comments:

Post a Comment

Sarvadhikariyaina Sarva Sakthimanthudu | Telugu Christian Song # 604

ఏదైనా సాధ్యమే | Telugu Christian Song ✨ ఏదైనా సాధ్యమే ✨ సర్వాధికారియైన సర్వశక్తిమంతుడు అధిక ప్రేమామయ...

About Me

My photo
I’m Gnana Ratnam Veladuti, a devoted Christian sharing devotional messages and sermons. My goal is to encourage believers to stay strong in faith.

📌 Follow my blog for daily inspiration and spiritual encouragement.