Monday, 8 August 2016

179. Prema Yesuni Prema Adi Evvaru Koluvalenidi

ప్రేమ యేసుని ప్రేమ - అది ఎవ్వరు కొలువలేనిది
నిజము దీనిని నమ్ము - ఇది భువి యందించలేనిది
ఎన్నడెన్నడు మారనిది - నా యేసుని దివ్య ప్రేమ
ఎన్నడెన్నడు వీడనది - నా యేసుని నిత్య ప్రేమ

తల్లితండ్రుల ప్రేమ - నీడవలె గతియించును
కన్నబిడ్డల ప్రేమ - కలలా కరిగిపోవును

భార్యభర్తల మధ్య - వికసించిన ప్రేమ పుష్పము
వాడిపోయి రాలును త్వరలో-మోడులా మిగిలిపోవును

బంధుమిత్రుల యందు - వెలుగుచున్న ప్రేమ దీపము
నూనె ఉన్నంత కాలమే - వెలుగునిచ్చి ఆరిపోవును

ధరలోని ప్రేమలన్నియు - స్థిరము కాదు కరిగిపోవును
క్రీస్తు యేసు కల్వరి ప్రేమ - కడవరకు ఆదరించును

No comments:

Post a Comment

Sarvadhikariyaina Sarva Sakthimanthudu | Telugu Christian Song # 604

ఏదైనా సాధ్యమే | Telugu Christian Song ✨ ఏదైనా సాధ్యమే ✨ సర్వాధికారియైన సర్వశక్తిమంతుడు అధిక ప్రేమామయ...

About Me

My photo
I’m Gnana Ratnam Veladuti, a devoted Christian sharing devotional messages and sermons. My goal is to encourage believers to stay strong in faith.

📌 Follow my blog for daily inspiration and spiritual encouragement.