Saturday, 6 August 2016

159. Chalunaya Deva Chalunaya Napai Ni Premaye

చాలునయా దేవా చాలునయా - నాపై నీ ప్రేమయే చాలును
మరువలేనయ్యా మరచిపోనయ్యా - నాపై నీకున్న ఈ ప్రేమను
విడవలేనయ్యా విడిచిపోనయ్యా

కాలాలు మారిన మారిపోని నీప్రేమ - తరాలు తరిగినా తరిగిపోని నీ
ప్రేమ నను కన్నవారే నన్నె మరచినా - స్నేహితులే నను వెలివేసినా
విడువని ప్రేమతో నన్నావరించి - అక్కున చేర్చుకొని ఆదరించావయా..

పాపపు ఊబిలో పడియుండగా - నీ ప్రేమతో నను కనుగొన్నావయ్యా
సిలువప్రేమతో నా దరిచేరి - నా చేయిప్టి నన్ను లేపావయ్యా
నా పాపములన్ని నీవు కడిగి - పరిశుద్ధునిగా నను చేశావయ్యా

కాలాలు మరినా క్షామమే ప్రబలినా - కోరినవి దూరమైన ఖడ్గమే ఎదురైనా
కలువరివైపే నే సాగెదన్‌ - కలువరినాధా నిన్నే కొలిచెదను
చిరకాలము నిన్నారాధింతున్‌ - భజియించి కీర్తించి స్తుతియింతును

No comments:

Post a Comment

585. Tholakari Vaana Deevenalu Kuripinchu Vaana

తొలకరి వాన దీవెనలు కురిపించు వాన పరిశుద్ధాత్మ వాన ప్రభు వర్షించు నీ జీవితాన (2) అది నూతన పరచును ఫలియింపచేయును సమృద్ధినిచ్చును సంతోషప...