Saturday, 20 August 2016

201. Nee Vakyame Nannu Brathikinchenu

నీ వాక్యమే నన్ను బ్రతికించెను
బాధలలో నెమ్మది నిచ్చెను
కృపాశక్తి దయాసత్య సంపూర్ణు 
వాక్యమై యున్న యేసు వందనమయ్యా

జిగటగల యూబి నుండి లేవనెత్తెను
సమతలమగు భూమిపై నన్నునిలిపెను
నా పాదములకు దీపమాయెను
సత్యమైన మార్గములో నడుపుచుండెను

శతృవులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై
యుద్ధమునకు సిద్ధ మనస్సు నిచ్చుచున్నది
అపవాది వేయుచుండు అగ్ని బాణములను
ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది

పాలవంటిది జుంటె తెనె వంటిది
నా జిహ్వకు మహా మధురమైనది
మేలిమి బంగారుకన్న మిన్నయైునది
రత్నరాశుల కన్నా కోరదగినది.

2 comments:

Neevu Thappa Nakevaru Unnarayya Lyrics in Telugu | Christian Song #591

Neevu Thappa Nakevaru Unnarayya Lyrics in Telugu | Christian Song #591 Song No: 591 Language: Telugu Category: Worship Song 🎵 Te...