Tuesday, 4 January 2022

571. Stuthi Padutake Brathikinchina (Hosanna New Year Song 2022 Lyrics)

స్తుతి పాడుటకే బ్రతికించిన
జీవన దాతవు నీవేనయ్యా
ఇన్నాళ్లుగా నన్ను పోషించినా
తల్లివలె 
నను ఓదర్చినా
నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్య (2)
జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా
నా జీవిత కాలమంత ఆరాధించి ఘనపరతును

ప్రాణభయమును తొలగించినావు
ప్రాకారములను స్థాపించినావు
సర్వజనులలో నీ మహిమ వివరింప
దీర్ఘాయువుతో నను నింపినావు (2)
నీ కృపా బాహుళ్యమే - వీడని అనుబంధమై
తలచిన ప్రతి క్షణమున - నూతన బలమిచ్చెను 

నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు
కనుమరుగాయెను నా దుఖ:దినములు
కృపలనుపొంది నీ కాడి మోయుటకు
లోకములోనుండి ఏర్పరచినావు (2)
నీ దివ్య సంకల్పమే - అవనిలో శుభప్రదమై
నీ నిత్య రాజ్యమునకై - నిరీక్షణ కలిగించెను 

హేతువు లేకయే ప్రేమించినావు
వేడుకగా ఇల నను మార్చినావు
కలవరమొందిన వేళలయందు
నా చెయ్యి విడువక నడిపించినావు (2)
నీ ప్రేమ మాధుర్యమే - నా నోట స్తుతి గానమై
నిలిచిన ప్రతి స్థలమున - పారెను సెలయేరులై 

Neevu Thappa Nakevaru Unnarayya Lyrics in Telugu | Christian Song #591

Neevu Thappa Nakevaru Unnarayya Lyrics in Telugu | Christian Song #591 Song No: 591 Language: Telugu Category: Worship Song 🎵 Te...