Showing posts with label Bible Mission Songs. Show all posts
Showing posts with label Bible Mission Songs. Show all posts

Wednesday, 4 April 2018

Rammu Nedi Pendliki Deva | Telugu Christian Song # 473

రమ్ము! నేడీ పెండ్లికి - దేవ!

కరుణ దయచేయు మదియాదరణ
విశ్వాసమందు - మరణ - పర్యంతము
నీ - స్మరణజేయు సాయమీయ

ఈ వ-ధూవరులను - దేవ - భక్తులజేసి
జీవ - నంబౌ గృహాన బ్రోవ జీవాధిపతి

లిలియ - పుష్పంబు వలెనె - వెలయు
గష్టాదులచే - నలయ - కుండ నిన్నెపుడు
నీలోనె కలియు - గృపాదానార్ధమై

నీతి-మార్గంబున బ్ర-ఖ్యాతి-గా బావురంబు
రీతి - నిష్కపటులై నీచేతి - నీడన్నిల్చుటకై

ఇలను - మానవాళియె - డలను
నీ హద్దులలో - పలను సకల - నీతి
వి-ధులను - నెరవేర్పించి నడుప

చేరి - యున్న యీ సభవారి
దంపతులగు - వీరి - బోధకులగు
వారి - నాశీర్వదింపను

Friday, 9 March 2018

398. Dhanyudu Deva Manavudu Dhanyudu

ధన్యుడు దేవ మానవుడు
ధన్యుడు - ధన్యుడు దైవజనుడు
ధరణి జనులందరి కన్న- అన్యులెంతటి
వారైన అతనికి సాటి రారు

చెడుగుల యోచనలందు - నడువని వాడై పాపులు
అడుగు బెట్టుదారుల- యందు నిలువని యతడు

పరిహసించు వ్యతిరేక - ప్రజలు గుమిగా గూర్చుండు
దరిని గూర్చుండ నట్టి - నరుడెవ్వడో యతడు

మురియు దైవాజ్ఞలున్న - పరిశుద్ధ శాస్త్రము జూచి
మురియుచు రేబగళ్ళు- స్మరియించుచుండు నతడు

అతడేటి యోర మొలిచి - ఆకు వాడనిదై తగిన
ఋతువున గాయు చెట్టై - హెచ్చరిల్లును గాన

అతడు తలపెట్టి చేయ - యత్నించు నెల్ల పనులు
సతతము సంపూర్ణముగ సఫల మగుచుండును గాన

ఆలా గుండకను దుష్టుల్ - గాలి కొట్టిన పొట్టున్
బోలిన వారై చెదరి - పోదు రంతర్ధానంబై

కాన దుష్టుల్ తీర్పు - లో నిల్వ నేలేరు
హీనుల్ నీతి పరుల - లో నాగనే లేరు

పరమ దేవునికి నీతి - పరుల మార్గంబు తెలియు
దురితుల పన్నాగములు - సరిగా కీడునకే నడుపు

Wednesday, 31 August 2016

248. Edu Matalu Palikinava

ఏడు మాటలు పలికినావా = ప్రభువ - ఏడు ముఖ్యాంశములు - ఎరుక
పరచితివా

1. దేవుండవు కాని యెడల - నిన్ను - తిప్పి చంపువారిన్‌ - క్షమియింప
గలవా = జీవమై యుండని యెడల - నిన్ను - చావు దెబ్బలు గొట్ట
- సహియింప గలవా (లూకా 23:34)

2. రక్షణ కథ నడిపినావా - ఒకరిన్‌ - రక్షించి పరదైసు - కొనిపోయినావా
= శిక్షితునికి బోధింపకనే - శాంతి - లక్షణము చూపుచు -
రక్షించినావా (లూకా 23:43)

3. తల్లికి నొక సంరక్షకుని - నిచ్చి - ఎల్లకరకు మాదిరి - కనపరచినావా
= తల్లికి సృష్టికర్తవై - ప్రేమ తనయుండవై గౌర - వించి యున్నావా
(యోహాను 19:26, 27)

4. నరుడవు కాకున్న యెడల - దేవ - నన్నేల విడిచితి - వని యడిగినావా
= నరుడవును దేవుండవును - గాన - నా పూర్ణ రక్షకుడ - వని
ఋజువైనావా (మార్కు 15:34)

5. ఎన్నిక జనుల ద్వేషంబు - నీకు - ఎండ యైునందున - దప్పి
గొన్నావా = ఉన్న యెండకును బాధకును - జిహ్వ - కూట లేనందున
- దాహమన్నావా (యోహాను 19:28)

6. పాపుల రక్షణ కొరకు - చేయ - వలసిన పనులెల్ల - ముగియించినావా
= పగలు పగవారి - తుదకు - అంతము కాగా సమాప్త మన్నావా
(యోహాను 19:30)

7. కనుక నీ యాత్మన్మరణమున - నీదు - జనకుని చేతుల -
కప్పగించితివా = జనులందరును యీ పద్ధతినే - ను -
అనుసరించునట్లు - అట్లు చేసితివా (లూకా 23:46)

Tuesday, 19 July 2016

Anadi Purushundaina Devuni Aaradinchandi | Telugu Christian Song #4

అనాది పురుషుండైన దేవుని - ఆరాధించండి =  అనాది దేవుడే - అనంత దేవుడై యుండె - అనాదిని

ఒక్కండే దేవుండు - ఒంటరిగానెయుండె - అనాదిని = ఎక్కువ మందియైన ఎవరిని గొల్వవలెనో తెలియదు -    ఆందోళం

పాపంబు నరులకు - పరమాత్ముని మరుగు చేసెను అయ్యయ్యో = పాపులందుచేత - పలువిధ దేవుండ్లను కల్పించిరి - విచారం

గనుక సర్వంబునకు - కర్తయైన ఏకదేవున్ - కనుగొనుడి = కనుగొని మ్రొక్కండి - అని బోధించుచున్నాము - శుభవార్త

ఆకాశము భూమియు - లేకముందే కాలము - దూతలు = లేకముందే దేవు - డేక దేవుండై యుండె గంభీరం



Subhakara Sudhakara | Telugu Christian Song #1


శుభాకరా! శుద్ధాకరా! వి-శుద్ధ వందనమ్ =
నభానభూమి సర్వౌ-న్నత్య వందనమ్

యెహోవ ! స్రష్ఠ ! జనక ! నీకు - నెంతయు బ్రణుతి -
మహోన్నతుండ ! దివ్యుడ ! ఘన-మహిమ సంస్తుతి

విమోచకా ! పిత్రాత్మజుండ ! - విజయ మంగళమ్ =
సమస్త సృష్టి సాధనంబ ! - సవ్య మంగళమ్

వరాత్మ పితాపుత్ర నిర్గమ - వరుడ ! స్తోత్రము =
వరప్రదుండ! భక్త హృదయ - వాస ! స్తోత్రము

Preminthunu Prabhuva Ninnu Lyrics | ప్రేమింతును ప్రభువా నిన్ను | Telugu Christian Song Lyrics # 609

ప్రేమింతును ప్రభువా నిన్ను సాంగ్ లిరిక్స్ (Preminthunu Prabhuva Ninnu Lyrics) పల్లవి: ప్రేమింతును ప్రభువా నిన్ను ప్రార్ధింతును ...